Begin typing your search above and press return to search.

స్రవంతి.. మళ్ళీ బ్లాస్ట్ అయ్యేలా గ్లామర్ షో

తాజాగా స్రవంతి కొత్త ఫొటో షూట్ ను షేర్ చేసింది. గ్రే కలర్ లాంగ్ ఫ్రాక్ లో దిగిన చిత్రాలను పంచుకుంది. నడుముకు రెడ్ బెల్ట్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 6:43 AM GMT
స్రవంతి.. మళ్ళీ బ్లాస్ట్ అయ్యేలా గ్లామర్ షో
X

స్రవంతి చొక్కారపు.. ఈ అందం బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయింది. తన గేమ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. షోలో తనకు పెళ్లి అయిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆటతో ఫిదా చేసిన స్రవంతి.. టాప్-5 వరకు ఉండలేకపోయింది. కానీ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం స్ట్రాటజీతో పాటు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్రవంతికి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. స్రవంతి కూడా తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది. పెళ్లైనా కూడా ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది. అందాలు ఆరబోస్తూ వావ్ అనిపిస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ తోపాటు శారీల్లో ఫొటోలు దిగి పోస్ట్ చేస్తోంది. నెట్టింట హీట్ పుట్టిస్తుంటోంది.

తాజాగా స్రవంతి కొత్త ఫొటో షూట్ ను షేర్ చేసింది. గ్రే కలర్ లాంగ్ ఫ్రాక్ లో దిగిన చిత్రాలను పంచుకుంది. నడుముకు రెడ్ బెల్ట్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటి లానే తన నవ్వుతో ఫిదా చేస్తోంది. చెవులకు పెట్టుకున్న పెద్ద ఇయర్ రింగ్స్.. ఆమె అందాన్ని మరింత పెంచాయి. దీంతో స్రవంతి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్రవంతి గ్లామర్ కు ఫిదా అయిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. లవ్లీ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీ నవ్వుకు ఫిదా అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలో యాంకర్ గా సత్తా చాటుతోంది. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు యాంకర్ గా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అందుకోసం ఎప్పుటికప్పుడు అట్రాక్టివ్ గా రెడీ అవుతోంది.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన పుష్ప మూవీ ఇంటర్వ్యూతోనే ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది స్రవంతి. ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందరినీ తెగ ఆకట్టుకుంది. అలా సూపర్ క్రేజ్ సంపాదించుకుని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఈమెకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయని టాక్. మరి చూడాలి ఈమె కెరీర్ ఎలా ఉండనుందో.