Begin typing your search above and press return to search.

మోస్ట్ అవైటెడ్ 'స్క్విడ్ గేమ్ 3'.. ట్రైలర్ చూశారా?

స్క్విడ్ గేమ్ సిరీస్ గురించి బహుశా తెలియని వారు ఉండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   1 Jun 2025 2:06 PM IST
మోస్ట్ అవైటెడ్ స్క్విడ్ గేమ్ 3.. ట్రైలర్ చూశారా?
X

స్క్విడ్ గేమ్ సిరీస్ గురించి బహుశా తెలియని వారు ఉండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొరియన్ భాషలో తెరకెక్కిన ఆ సిరీస్ కు సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియన్స్ కూడా సిరీస్ ను తెగ చూసేశారు. దీంతో ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బ్రేక్ అయిపోయాయి.

డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను కళ్లకు కట్టినట్లు చూపించిన స్క్విడ్ గేమ్ సిరీస్.. నెట్టింట ఫుల్ ట్రెండ్ అయింది. ఇప్పటికే సిరీస్‌ నుంచి వచ్చిన రెండు పార్టులకు ఫుల్ క్రేజ్ వచ్చింది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌ ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రెండో పార్ట్ ను రూపొందించారు మేకర్స్.

అయితే రెండో పార్ట్ మరింత ఫేమస్ అయింది. దానికి కూడా బాగా క్రేజ్ రావడంతో ఇప్పుడు మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ా సిరీస్.. జూన్ 27వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సియోంగ్ గీ హున్ (లీ జంగ్ జే) గేమ్ కు ఎలా ముగింపు పలుకుతాడు? ఆ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్‌ ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు సిరీస్ లో ప్రధానంగా చూపించనున్నట్లు క్లియర్ గా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

అయితే స్క్విడ్‌ గేమ్ సీజన్ 2 సిరీస్ మొత్తం సియోంగ్ గీ హున్ చుట్టే తిరిగిందన్న విషయం తెలిసిందే. సిరీస్ లో ఆయన స్క్విడ్‌ గేమ్‌ అన్ని స్టేజెస్ పూర్తి చేస్తారు,. ఆ తర్వాత 45.6 బిలియన్‌ కొరియన్‌ వన్‌ లు గెలుచుకుంటారు. కానీ మనుషుల ప్రాణాలు తీసే డేంజరస్ గేమ్‌ కు ఎలాగైనా ముగింపు పలకాలని ఇప్పటికే ఫిక్స్ అవుతారు.

ఆ గేమ్ ఆడిస్తున్న వ్యక్తిని కనుగొనాలని డిసైడ్ అవుతారు. అదే ఇప్పుడు మూడో సీజన్ లో మెయిన్ స్టోరీ లైన్. ఇదే చివరి సీజన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మూడో సీజన్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ముందు టీజర్.. ఇప్పుడు ట్రైలర్.. రెండూ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మరి స్క్విడ్ గేమ్ 3 సిరీస్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.