Begin typing your search above and press return to search.

డార్లింగ్ తో 'స్పిరిట్' డేట్ లాక్ అయిందా?

డిసెంబ‌ర్ లో ముహూర్తం పెట్టిన‌ట్లు తాజాగా చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే సినిమా ప్రారంభోత్సవం నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

By:  Tupaki Desk   |   31 March 2024 9:30 AM GMT
డార్లింగ్ తో  స్పిరిట్ డేట్ లాక్ అయిందా?
X

'యానిమ‌ల్' రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి సందీప్ రెండ్డి వంగా సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. డార్లింగ్ తో తెర‌కెక్కించాల్సిన 'స్పిరిట్' సంగ‌తులేంటి? అంటే ఆప‌నుల్లోనే బిజీ అవుతున్నానంటూ చెప్పాడు. కానీ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వంటి వివ‌రాల‌న్నీ గోప్యంగా ఉంచాడు. డార్లింగ్ ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇంకా డేట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో సందీప్ ఇలా సైలెంట్ గా ఉండాల్సి వ‌స్తొంది. మేలో 'క‌ల్కీ 2897' రిలీజ్ అయితే డార్లింగ్ ఫ్రీ అయిపోతాడు.

అటుపై 'స‌లార్ -2' ప్రారంభ‌మ‌వుతుంది. దీన్ని 15 నెల‌ల్లోనూ పూర్తి చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో పాటు 'రాజాసాబ్' షూట్ లో కూడా పాల్గొంటారు ప్ర‌భాస్. స‌లార్ -2 రిలీజ్ అనేది 2025 మిడ్ త‌ర్వాతే ఉండే అవ‌కాశం ఉంది. ఈ లోగా రాజాసాబ్ ని రిలీజ్ చేస్తారు. మ‌రి వీటి మ‌ధ్య‌లో 'స్పిరిట్' ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే? డిసెంబ‌ర్ లో ముహూర్తం పెట్టిన‌ట్లు తాజాగా చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే సినిమా ప్రారంభోత్సవం నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

అనంత‌రం 2025 లోరెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌న్న‌ది సందీప్ ప్లాన్ గా తెలుస్తోంది. అప్ప‌టికే 'స‌లార్ -2' షూటింగ్ నుంచి కూడా కొంత వ‌ర‌కూ డార్లింగ్ ప్రీ అయిపోతాడు. మేజ‌ర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్త‌వుతుంది. నాటి నుంచి ప్ర‌భాస్ స్పిరిట్ కి షూట్ కి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. హ‌నురాఘ‌వ‌పూడి సినిమా డార్లింగ్ లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల‌గా ఈ సినిమా ప‌నుల్లోనే హ‌ను బిజీగా ఉన్నాడు.

వ‌ర‌ల్డ్ వార్ లవ్ స్టోరీ ఆధారంగా రూపొంద‌నున్న చిత్ర‌మిది. ఇంత‌వ‌ర‌కూ ఇండియ‌న్ స్క్రీన్ పై ఇలాంటి ల‌వ్ స్టోరీ జాన‌ర్ ని ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని కాన్సెప్ట్ ఇది. దీంతో ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా కాబ‌ట్టి ఇది ప్రారంభ అవ్వ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌ని తాజాగా అందుతోన్న స‌మాచారం. ఈలోపు ప్ర‌భాస్ స‌లార్-2..స్పిరిట్ చిత్రాలు ముగించాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది.