Begin typing your search above and press return to search.

ప‌ర్‌ఫెక్ట్‌గా లెక్క‌లేసుకున్నాకే డేట్ ఇచ్చాడా?

`యానిమ‌ల్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ర‌ణ్‌బీర్ క‌పూర్ వంటి స్టార్‌తో స‌రికొత్త క్యారెక్ట‌ర్ చేయించి అన్ బిలీవ‌బుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని అందించాడు సందీప్ రెడ్డి వంగ.

By:  Tupaki Desk   |   18 Jan 2026 1:00 AM IST
ప‌ర్‌ఫెక్ట్‌గా లెక్క‌లేసుకున్నాకే డేట్ ఇచ్చాడా?
X

`యానిమ‌ల్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ర‌ణ్‌బీర్ క‌పూర్ వంటి స్టార్‌తో స‌రికొత్త క్యారెక్ట‌ర్ చేయించి అన్ బిలీవ‌బుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని అందించాడు సందీప్ రెడ్డి వంగ. ఇదే జోష్‌తో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా `స్పిరిట్‌`ని ప‌ట్టాలెక్కించాడు. వివేక్ ఓబెరాయ్‌, ప్ర‌కాష్ రాజ్, కాంచ‌న‌ లాంటి క్రేజీ న‌టుల‌ని కీల‌క క్యారెక్ట‌ర్‌ల‌ని ఎంచుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌భాస్‌ని తొలి సారి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపిస్తూ ప్రాజెక్ట్‌పై అంచ‌నాల్ని పెంచేశాడు.

దీపిక ప‌దుకోన్ త‌ప్పుకోవ‌డంతో త‌న స్థానంలో `యానిమ‌ల్` బ్యూటీ త్రిప్తి దిమ్రీని రంగంలోకి దించేసిన సందీప్ డైలాగ్ టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ల‌తో సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాడు. ఈ నేప‌థ్యంలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ఆల్ ఆఫ్ స‌డ‌న్‌గా ప్ర‌క‌టించ‌డంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా సందీప్ నుంచి ఈ అప్ డేట్‌ని ఊహించ‌లేదు. 2027, మార్చి 5న భారీ స్థాయిలో `స్పిరిట్‌` మూవీని రిలీజ్ చేస్తున్నాం అంటూ ప్ర‌క‌టించి అంద‌రిని షాక్‌కు గురి చేశాడు సందీప్ రెడ్డి వంగ‌. ఇంత సింపుల్‌గా, ఇంత హ‌డావ‌డిగా సినిమా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించడానికి కార‌ణం ఏంటీ?

దీని వెన‌క సందీప్ ప్లానింగ్‌, లెక్క‌లు ఏమైనా ఉన్నాయా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మూవీని టి సిరీస్‌తో క‌లిసి సందీప్ సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్‌పై నిర్మిస్తున్నాడు. దీంతో బిజినెస్ లెక్క‌ల‌ని ప‌క్కాగా ప్లాన్ చేసుకున్న త‌రువాతే మార్చి 5న `స్పిరిట్‌`ని రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. సందీప్ ఏది చేసినా ప‌ర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటాడు. ఎవ్రీ డీటెయిలింగ్ మిస్ కాకుండా ప‌ర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకునే సందీప్ ..పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమా రిలీజ్ కోసం ఇంకెంత ప్లానింగ్ చేసుకుని ఉంటాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ మూవీతో ఆల్ రికార్డ్స్‌ని బ్రేక్ చేయాల‌న్న‌ది సందీప్ ఫ‌స్ట్ టార్గెట్‌. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే `స్పిరిట్‌`ని ఏదో ఒక అకేష‌న్‌, ఫెస్టివ‌ల్‌ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయొద్దు. అది యూనివ‌ర్స‌ల్ గా ఉప‌యోగ‌ప‌డే డేట్ అయి ఉండాలి. య‌స్ అదే ప్లాన్‌తో సందీప్ రెడ్డి వంగ మార్చి 5ని సెలెక్ట్ చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి లాంటి సీజ‌న్‌లో రిలీజ్ చేస్తే మిగ‌తా సినిమాల‌తో పోటీప‌డాలి, థియేట‌ర్స్ ల‌భించ‌వు.. అంతే కాకుండా ఇత‌ర దేశాల్లో కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు కాబ‌ట్టి ప‌ర్టికుల‌ర్‌గా మ‌న‌కు తెలిసిన‌ సీజ‌న్ వ‌ర్క‌వుట్ కాదు.

ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనే కాకుండా మాండ‌రిన్‌, జ‌ప‌నీస్ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ కార‌ణంగానే మార్చి 5 ప‌ర్‌ఫెక్ట్ అని భావించిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా మార్చి 5 ఫ్రైడే.. ఆ త‌రువాత రోజు శ‌నివారం మ‌హాశివ‌రాత్రి..ఆ నెక్స్ట్ డే సండే లాంగ్ వీకెండ్ వ‌స్తోంది. ఆ త‌రువాత రంజాన్ సెల‌వులు వ‌స్తున్నాయి. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప‌క్కాగా బిజినెస్ లెక్క‌లు వేసుకున్నాకే ఈ డేట్‌ని సందీప్ ఫైన‌ల్ చేసుకున్నాడ‌ని, సోలో రిలీజ్ ప‌క్కాగా ప్లాన్ చేశాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.