Begin typing your search above and press return to search.

హ‌నీరోజ్ తో మ‌సాలా స‌న్నివేశాలా?

ఇదే స‌మ‌యంలో అమ్మ‌డు హాట్ హాట్ ఇన్ స్టా ఫోజులు నెట్టింట సంచ‌ల‌నం అవ్వ‌డంతో మ‌రింత పాపుల‌ర్ అయింది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 5:30 PM GMT
హ‌నీరోజ్ తో మ‌సాలా స‌న్నివేశాలా?
X

'వీర‌సింహారెడ్డి'తో హ‌నీ రోజ్ తెలుగింట ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. అంత‌కు ముందు రెండు..మూడు తెలుగు సినిమాలు చేసినా ఏ సినిమా తీసుకురాని గుర్తింపు బాల‌య్య సినిమా తెచ్చి పెట్టింది. ఇదే స‌మ‌యంలో అమ్మ‌డు హాట్ హాట్ ఇన్ స్టా ఫోజులు నెట్టింట సంచ‌ల‌నం అవ్వ‌డంతో మ‌రింత పాపుల‌ర్ అయింది. వివిధ భంగిమ‌ల్లో హ‌నీ పోజులే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని తెచ్చిపెట్టాయి.

దీంతో అమ్మ‌డు అప్పటి నుంచి ఆ ర‌క‌మైన వేడి ఏమాత్రం త‌గ్గించ‌కుండా అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటూ వెళ్తుంది. ఆర‌క‌మైన పాపులారిటీ ఏకంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కే ప్ర‌మోట్ చేసింది. ప్ర‌స్తుతం హ‌నీ రోజ్ ప్ర‌ధాన పాత్ర‌లో రాహేలు అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఆనందిని బాలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే హ‌నీ రోజ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈసంద‌ర్భంగా సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌త‌లు లీక‌వుతున్నాయి. ఇందులో యువ‌త‌ని మెప్పించే అంశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఆ ర‌క‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకున్నారుట‌. హ‌నీరోజ్ తో కొన్ని ఘాటైన మ‌సాలా స‌న్నివేశాలు చేయించిన‌ట్లు...అవి సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌?...కుర్ర‌కారులో ఊపు తెచ్చేలా ఉంటాయ‌ని గుస గుస వినిపిస్తోంది. హ‌నీరోజ్ పాత్ర ప్రేక్ష‌కులు ఏమాత్రం ఊహించ‌ని విధంగా ఉంటుందని..చాలా స‌న్నివేశాలు స‌ర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి.

మ‌రి అమ్మ‌డితో ఎంత‌టి సామ‌సాలు చేయించారో? రిలీజ్ త‌ర్వాత తెలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్లే ఐటం భామ‌లైపోతున్నారు. అవ‌స‌రం మేర హాట్ హాట్ స‌న్నివేశాల్లో..పాటల్లో వాళ్లే క‌నిపిస్తు న్నారు. దీంతో ప్ర‌త్యేకంగా ఐటం భామ‌ల్ని దిగుమ‌తి చేయాల్సిన అవ‌స‌రం త‌గ్గింది. కానీ ఐటం భామ‌ల్లో ఉన్న ప్ర‌త్యేక‌త హీరోయిన్ల కొర‌వ‌డుతుంది అన్న‌ది వాస్త‌వం. ప్ర‌త్యేక ఐటం భామ‌ల్లో ఉండే గ్రేస్ స్వాగ్...హీరోయిన్ల‌లో కనిపించ‌లేదు.