Begin typing your search above and press return to search.

ప్రభాస్ పేరులో మార్పు.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్!

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ప్రభాస్ పేరులో కాస్త మార్పు కనిపించింది. సాధారణంగా ఇంగ్లీష్ లో ప్రభాస్ స్పెల్లింగ్ 'PRABHAS' అని వస్తుంది. కానీ ఈ పోస్టర్లో మాత్రం 'PRABHASS' అని ఉంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 9:55 AM GMT
ప్రభాస్ పేరులో మార్పు.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్!
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్ - మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

చెప్పినట్లుగానే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక మారుతీ - ప్రభాస్ కాంబినేషన్ మూవీకి 'రాజా సాబ్' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్లో టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా కూల్గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. డార్లింగ్ హెయిర్ స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది.

లాంగ్ హెయిర్తో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ మారుతి తన సినిమాల్లో హీరో లుక్ మీద చాలా కేర్ తీసుకుంటారు. 'ది రాజా సాబ్' పోస్టర్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్నాళ్లుగా ప్రభాస్ తన లుక్స్ విషయంలో ఫాన్స్ ని నిజం పాయింట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మారుతి ఫ్యాన్స్ కి నచ్చే విధంగా డార్లింగ్ లుక్ ని డిజైన్ చేయడంతో ఈ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

జస్ట్ లుక్ విషయంలోనే ఇంత కేర్ తీసుకున్న మారుతి కచ్చితంగా ప్రభాస్ కి హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ప్రభాస్ పేరులో కాస్త మార్పు కనిపించింది. సాధారణంగా ఇంగ్లీష్ లో ప్రభాస్ స్పెల్లింగ్ 'PRABHAS' అని వస్తుంది. కానీ ఈ పోస్టర్లో మాత్రం 'PRABHASS' అని ఉంది.

ఇది గమనించిన అభిమానులు, నెటిజనులు ప్రభాస్ పేరులో మార్పు జరిగిందని, న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరులో మరొక అక్షరం 'S' యాడ్ చేసినట్లు సోషల్ మీడియా అంతట వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మూవీ టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'రాజా సాబ్' పోస్టర్ పై ప్రింటింగ్ మిస్టేక్ వల్లనే 'PRBHAS' కి బదులు 'PRABHASS' గా ముద్రించి నట్లు తెలుపుతూ ఫ్యాన్స్ దీనిని నమ్మొద్దని పేర్కొంది.