Begin typing your search above and press return to search.

చిరంజీవి 'విశ్వంభర' ప్ర‌త్యేక‌త ఏంటి?

తాజా స‌మాచారం మేర‌కు ఈరోజు శోబి మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాట షూటింగ్ ప్రారంభం కానుంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:14 AM GMT
చిరంజీవి విశ్వంభర ప్ర‌త్యేక‌త ఏంటి?
X

మెగాస్టార్ చిరంజీవి భారీ సోషియో ఫాంట‌సీ చిత్రంతో అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించేందుకు యువీ క్రియేష‌న్స్ సంస్థ పెట్టుబ‌డుల‌ను స‌మ‌కూరుస్తోంది. విశ్వంభర అనేది ఈ సినిమా టైటిల్. బింబిసార ఫేం వశిష్ట మల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది.

ఇటీవలే నల్గొండలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌కు మారింది. తాజా స‌మాచారం మేర‌కు ఈరోజు శోబి మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాట షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి స‌హా ఇత‌ర‌ నటీనటులు సెట్స్‌పైకి చేరారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టే అద్భుత‌మైన స్టెప్పుల‌ను కంపోజ్ చేసేందుకు శోబి మాస్ట‌ర్ పూర్తి ప్రిప‌రేష‌న్ సాగించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రం `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` త‌ర్వాత చిరుకి మ‌రో ఫాంట‌సీ సినిమా. ఆ స్థాయిలో విజ‌యం అందుకుంటుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ కి త‌గ్గ క‌థాంశంతో వ‌శిష్ట బిగ్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి, త్రిషతో పాటు సురభి పూర్ణైక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షవర్ధన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. 10 జనవరి 2025న సంక్రాంతి కానుక‌గా సినిమా విడుదల కానుంది.