Begin typing your search above and press return to search.

స్పార్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..!

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పార్క్. మెహ్రీన్, రుక్సర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 6:03 AM GMT
స్పార్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..!
X

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పార్క్. మెహ్రీన్, రుక్సర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న విక్రాంత్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. విక్రాంత్ చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా హరీష్ శంకర్, మారుతి అటెండ్ అయ్యారు.

గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో సుహాసిని, మెహ్రీన్, అనంత్ శ్రీరామ్, రుక్సర్ వీళ్లు తప్ప ఎవరు తెలియదు సినిమా రిలీజ్ తర్వాత అందరి పేర్లు మీకు తెలుస్తాయి. ఈమధ్య సోషల్ మీడియాలో ప్రతి సినిమా ఈవెంట్ కి వెళ్తున్నారని అడుగుతున్నారు. నేను స్ట్రగులింగ్ డేస్ లో వినాయక్, పూరి గారు తనని ఎంకరేజ్ చేశారు. కొత్త టాలెంట్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. నా సీనియర్స్ అందరు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను కూడా అలానే చేస్తున్నా. ట్రైలర్ చూస్తే ఇది చాలా పెద్ద సినిమాగా కనిపించింది. నవంబర్ 17న సినిమా మంచి విజయం అందుకోవాలని అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. మామూలుగా రుక్సర్ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఈ సినిమా సాంగ్ చూపించింది. కొత్త హీరోతో ఇంత ఖర్చు పెట్టారేంటి అనుకున్నా.. తర్వాత తెలిసింది ఆయనే మొత్తం చేశారని. యూఎస్ నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. విక్రాంత్ కి ఈ సినిమా పాత్ బ్రేకింగ్ సినిమా అవ్వాలని అన్నారు. మెహ్రీన్ కి ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అవ్వాలని సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుతున్నా అని అన్నారు.

స్పార్క్ లైఫ్ హీరోయిన్ రుక్సర్ మాట్లాడుతూ.. సుహాసిని గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. మీరు అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారు. మీరు ఎంతోమందిని ఇన్ స్పైర్ చేశారు. నా ఫస్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం.. చివరి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి సినిమాలో కొత్త రోల్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. స్పార్క్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ తో చేశారు. ప్రేక్షకులు లేనిది నేను లేను.. మీరు లేనిది సినిమా లేదు. 17న సక్సెస్ చేస్తారని అడ్వాన్స్ గా థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా విక్రాంత్ కి చాలా స్పెషల్. అతనికి ఆల్ ది బెస్ట్.. మీరు సినిమాపై చూపించిన ప్రేమ ఆడియన్స్ నుంచి రిటర్న్ వస్తుందని అన్నారు రుక్సర్.

మెహ్రీన్ మాట్లాడుతూ.. సుహాసిని మేడం తో కలిసి పనిచేయడం అదృష్టం గా భావిస్తున్నాను. విక్రాంత్ కి ఆల్ ది బెస్ట్. మీరంతా కూడా సపోర్ట్ చేసి విక్రాంత్ కలని నిజం చేస్తారని అనుకుంటున్నా. నిర్మాత లీలా గారు ఈ సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారని అన్నారు మెహ్రీన్.

సినిమాలో నటించిన సీనియర్ యాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. మా టైం లో ఇంత ప్రేమ దొరకలేదు. మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషం. అందరికీ బెస్ట్ విషెష్.. కాలేజ్ డేస్ లో నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం. నేను ఈ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించాను. విక్రాంత్ ఈ సినిమాను చాలా రీసర్చ్ చేసి తీశాడు. అతను తన ఫుల్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాడు. ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ ది బెస్ట్.. ఈ సినిమాలో నాది చాలా డిఫరెంట్ రోల్. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ అందుకోవాలని అన్నారు సుహాసిని.