Begin typing your search above and press return to search.

స్పార్క్ టీజర్.. క్రేజీ యాక్షన్ మోడ్

ప్రచార చిత్రం ప్రారంభంలోనే నేలపై గుట్టలుగా పడి ఉన్న శవాలు తూటాలు చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:44 AM GMT
స్పార్క్ టీజర్.. క్రేజీ యాక్షన్ మోడ్
X

ఇండస్ట్రీలో మరో కొత్త హీరో పరిచయం కానున్నారు. ఆయన పేరే విక్రాంత్. ఈయన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'స్పార్క్'. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. మెహరీన్ కౌర్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్.


ఈ ప్రచార చిత్రం ఆద్యంతం చూస్తుంటే లవ్, యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కెమెరా వర్క్ కూడా ఎంతో హై క్వాలిటీగా రిచ్ గా కనిపిస్తోంది. కొత్త హీరో కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు అర్థం అవుతోంది.

ప్రచార చిత్రం ప్రారంభంలోనే నేలపై గుట్టలుగా పడి ఉన్న శవాలు, తూటాలు చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఓ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న హీరో స్పెషల్ ఏజంట్ గా మారడం, అతడిని పోలీసులు ఛేజ్ చేయడం, ఫైరింగ్ సీన్స్ చూస్తుంటే సినిమా పవర్ ఫుల్ గా తీసేందుకు ప్రయత్నించారని అర్థమవుతోంది.

అలాగే టీజర్ లో మెహరీన్, రుక్సార్ తో పాటు 'బిగ్ బాస్' ఫేమ్ అషురెడ్డిని చూపించారు. ఓ ఐలాండ్ లో విక్రాంత్, మెహరీన్ పై ఓ బ్యూటీఫుల్ సాంగ్ కూడా చిత్రీకరించారు. ఇక ఈ టీజర్ మొత్తానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందించిన సంగీతం కూడా హైలైట్ గా ఉంది. ఇంగ్లీష్ లిరిక్స్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కు హేషమ్ అబ్దుల్ అందించిన బాణీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో సుహాసిని, నాజ‌ర్‌, మ‌ణిర‌త్నం, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాను అన్నీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో...