Begin typing your search above and press return to search.

ఎవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్.. సంథింగ్ స్పెషల్..!

విక్రాంత్ హీరోగా చేస్తూ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కించిన సినిమా స్పార్క్. విక్రాంత్ సరసన మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు

By:  Tupaki Desk   |   11 Nov 2023 10:02 AM GMT
ఎవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్.. సంథింగ్ స్పెషల్..!
X

విక్రాంత్ హీరోగా చేస్తూ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కించిన సినిమా స్పార్క్. విక్రాంత్ సరసన మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే టీజర్ తో స్పార్క్ పై బజ్ ఏర్పడగా లేటెస్ట్ గా స్పార్క్ నుంచి కొత్త టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్ అంటూ ఓ కొత్త టీజర్ వచ్చింది. లాంతరు పెట్టుకుని బుజ్జి అంటూ వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్తుంటాడు. ఈ టీజర్ చూస్తే స్పార్క్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. ఎవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్ అంటూ రిలీజ్ చేసిన ఈ కొత్త టీజర్ ఇంప్రెస్ చేసింది.


ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందించడం కూడా చెప్పుకోదగ్గ అంశమని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ లో బజ్ పెంచుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. లేటెస్ట్ గా వచ్చిన ఎవిల్ సైడ్ ఆఫ్ స్పార్క్ లైఫ్ సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు ఆడియన్స్ కి హీరో ఎవరన్నది కాదు కథలో కంటెంట్ ఉందనిపిస్తే చాలు వారిని ప్రోత్సహిస్తారు. ఈ క్రమంలో విక్రాంత్ చేస్తున్న ఈ తొలి ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని చెప్పొచ్చు. సినిమా అనుకున్న బడ్జెట్ లో అనుకున్న కథని ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా తీశారని చెప్పొచ్చు.

ఈ సినిమాలో మెహ్రీన్ తెలుగు ఆడియన్స్ కు పరిచయస్తురాలే రుక్సర్ కూడా ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేసింది. సో ఈ ఇద్దరు సినిమాకు క్రౌడ్ పుల్లర్స్ గా ఉపయోగపడతారు. థియేటర్ దాకా ఆడియన్స్ వస్తే వారికి సినిమా నచ్చేలా చేయడం దర్శకుడి పని. మరి స్పార్క్ టీం ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూడాలి. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ స్పార్క్ సినిమాకు పోటీగా అజయ్ భూపతి మంగళవారం వస్తుంది. ఈ సినిమా కూడా ఆడియన్స్ లో మంచి హైప్ తెచ్చుకుంది. ఇక కన్నడ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారన్నది చూడాలి.