Begin typing your search above and press return to search.

స్పార్క్ L.I.F.E.. ఇదేదో కొత్తగా ఉందే..

భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్పార్క్ లైఫ్ టైటిల్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది

By:  Tupaki Desk   |   31 July 2023 10:35 AM GMT
స్పార్క్ L.I.F.E.. ఇదేదో కొత్తగా ఉందే..
X

ఈ మధ్యకాలంలో కొత్త కొత్త హీరోలు డిఫెరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ తమ టాలెంట్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండే కమర్షియల్ కథలపైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తమని తాము ఎలివేట్ చేసుకోవడానికి సరిపోయే కథలతో తెరంగేట్రం చేసి సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా విక్రాంత్ హీరోగా కొత్త మూవీ తెరకెక్కుతోంది.


భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్పార్క్ లైఫ్ టైటిల్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది. తాజాగా సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ ని వదిలారు. వాటర్ లో సగం వరకు తడిచి చేతిలో మాస్క్ పట్టుకొని సీరియస్ లుక్ లో హీరో చూస్తున్న పోస్టర్ ఇంటరెస్టింగ్ గా కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే విధంగా ఉందని చెప్పాలి. ఈ పోస్టర్ వదలడంతో పాటు టీజర్ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు.

స్పార్క్ మూవీ టైటిల్ టీజర్ ని ఆగష్టు 2న సాయంత్రం 6:45 గంటలకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో మెహరీన్, రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం.

ఖుషి సినిమాతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. నాని సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. దాంతో పాటు స్పార్క్ సినిమాకి కూడా అదిరిపోయే థ్రిల్లింగ్ మ్యూజిక్ ని ఇవ్వబోతున్నారు. పోస్టర్ తోనే ఇంటెన్సన్ క్రియేట్ చేసిన ఈ మూవీ కచ్చితంగా మార్కెట్ లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంది.

మరి విక్రాంత్ ఈ చిత్రంతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీజర్ తో సినిమా కంటెంట్ పై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీజర్ క్లిక్ అయితే మాత్రం మూవీపై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.