Begin typing your search above and press return to search.

ఎస్పీ బాలు విగ్రహవిష్కరణ: తెలంగాణ ఉద్యమకారుల ఫైర్!

ప్రముఖ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం రవీంద్రభారతిలో డిసెంబర్ 15 సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2025 4:03 PM IST
ఎస్పీ బాలు విగ్రహవిష్కరణ: తెలంగాణ ఉద్యమకారుల ఫైర్!
X

ప్రముఖ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం రవీంద్రభారతిలో డిసెంబర్ 15 సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహ స్థాపనపై తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ పాటలు పాడనన్న బాలు విగ్రహాన్ని తెలంగాణలో పెట్టడానికి వీల్లేదని.. ఏపీలో పెట్టుకోండంటూ ధ్వజమెత్తారు. మా ప్రాంతంలో మా ఉద్యమకారులే పెట్టాలని.. తెలంగాణను ద్వేషించిన ఇలాంటి ఎస్పీ బాలు విగ్రహం పెడితే ఊరుకోమని చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు.

ఎస్పీ బాలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన సంగీతం అనేక భాషలకు విస్తరించింది. ఆయన దక్షిణ భారత రాష్ట్రాలలోనే కాక.. దేశవ్యాప్తంగా సాంస్కృతిక దిగ్గజంగా గుర్తింపు పొందారు.

అభ్యంతరాలకు కారణాలు ఇవీ

రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కృషి చేసిన, తెలంగాణలో జన్మించిన సాంస్కృతిక ప్రముఖులకు మాత్రమే గౌరవం దక్కాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు. 2004లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష గీతం ‘జైజై హే తెలంగాణ అందేశ్రీ రాస్తే ఎస్పీ బాలు పాడేందుకు నిరాకరించారని పుకార్లు ఈ నిరసనలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. పాటలోని రాష్ట్ర సాధన డిమాండ్ ను తొలగిస్తేనే పాడుతానని ఎస్పీబీ షరతు విధించారని.. అందుకు అందెశ్రీ నిరాకరించారని తెలంగాణ కాంత్రిదళ్ అధ్యక్షుడు సంగారెడ్డి ఫృథ్వీరాజ్ ఆరోపించారు. ఎస్పీబీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా స్వరం వినిపించారని ఆరోపించారు.

తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ విషయంలో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోని అనేకమందిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఎస్పీ బాలు కూడా తెలంగాణ పాట పాడడానికి నిరాకరించారనే పుకారు ఉది. అందుకే తెలంగాణ కార్యకర్తలు రవీంద్రభారతిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను తెలంగాణ కార్యకర్తల పక్షాన ఉంటాను’ అని పేర్కొన్నారు.

తాజాగా పాశం యాదగిరి లాంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎస్పీ బాలు విగ్రహా ఏర్పాటును వ్యతిరేకించారు. తీవ్రంగా తిట్టిపోశారు. విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. విగ్రహం ప్రతిష్టిస్తే కూల్చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా జరుగబోయే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.