Begin typing your search above and press return to search.

హిందీలో సౌత్ ద‌ర్శ‌కుల హ‌వా

ఇది బాలీవుడ్ లో తెలుగు ద‌ర్శ‌కుల ఇమేజ్ ని పెంచింది. తెలుగు సినిమా కంటెంట్ పైనా గురి కుదిరింది. సౌత్ లో త‌మిళం, క‌న్న‌డ రంగం నుంచి ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు హిందీ పరిశ్ర‌మ‌లో నిరూపించారు. అందుకే

By:  Tupaki Desk   |   18 Feb 2024 3:45 AM GMT
హిందీలో సౌత్ ద‌ర్శ‌కుల హ‌వా
X

యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న అద్భుత‌మైన కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు సౌత్ ద‌ర్శ‌కులు. ముఖ్యంగా తెలుగు ద‌ర్శ‌కులు త‌మ స్థాయిని పెంచుకుంటూ దేశీయ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారుతున్నారు. ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ ఒర‌వ‌డికి ఆద్యుడిగా నిలుస్తారు. బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో రాజ‌మౌళి సంచ‌ల‌నంగా మారారు. ఆ త‌ర్వాత సౌత్ నుంచి కేజీఎఫ్- ప్ర‌శాంత్ నీల్, జ‌వాన్ -అట్లీ, మేజ‌ర్ - శ‌శికిర‌ణ్ తిక్క, కార్తికేయ‌- చందు మొండేటి పాన్ ఇండియా మార్కెట్లో స‌క్సెస్ సాధించారు. సందీప్ రెడ్డి వంగా క‌బీర్ సింగ్- యానిమ‌ల్ చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాల్ని అందుకున్నారు. ఉత్త‌రాదిన అత‌డు బిగ్ డిబేట్ గా మారాడు. తెలుగు సినిమాల స్థాయిని పెంచ‌డంలో వీరంతా స‌హ‌క‌రించార‌న‌డంలో సందేహం లేదు.

ఇది బాలీవుడ్ లో తెలుగు ద‌ర్శ‌కుల ఇమేజ్ ని పెంచింది. తెలుగు సినిమా కంటెంట్ పైనా గురి కుదిరింది. సౌత్ లో త‌మిళం, క‌న్న‌డ రంగం నుంచి ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు హిందీ పరిశ్ర‌మ‌లో నిరూపించారు. అందుకే ఇటీవ‌ల తెలుగు స‌హా సౌత్ లో ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు బాలీవుడ్ బ్యాన‌ర్లు, అగ్ర హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నాయి. టీ-సిరీస్ ఇప్ప‌టికే సందీప్ రెడ్డి వంగాతో వ‌రుస చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోంది. స‌ల్మాన్ ఖాన్, అక్ష‌య్ కుమార్, అజ‌య్ దేవ‌గ‌న్, సైఫ్ ఖాన్ స‌హా ప‌లువురు అగ్ర హీరోలు సౌత్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసేందుకు స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సౌత్ ద‌ర్శ‌కుల క‌థ‌ల‌ను వింటున్నారు. కొన్ని ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్ల‌గా, కొన్ని సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. మురుగ‌దాస్, మ‌ణిర‌త్నం లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తోను సినిమాలు చేసేందుకు హిందీ హీరోలు ఆస‌క్తిగా ఉన్నారు.

ఏది ఏమైనా ఉత్త‌రాది మార్కెట్లో సౌత్ ద‌ర్శ‌కుల స్థాయి పెరిగింది. ఇక్క‌డి నుంచి ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు దారులు సుగ‌మం అయ్యాయి. ఇది ఒక రకంగా మ‌న‌ ద‌ర్శ‌కుల‌కు మ‌హ‌ర్ధ‌శ అని చెప్పాలి. మారిన ట్రెండ్ లో అద్బుత‌మైన‌ కంటెంట్ తో సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం ద్వారా సౌతిండియా ద‌ర్శ‌కులు మ‌రింత‌గా త‌మ స్థాయిని పెంచుకుంటార‌నే ఆకాంక్షిద్దాం. మునుముందు మ‌రింత మంది తెలుగు ద‌ర్శ‌కులు ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క లీగ్ లో ప్ర‌వేశించాల‌ని కోరుకుందాం.