Begin typing your search above and press return to search.

ఇది సార్ డైరెక్టర్ బ్రాండ్ అంటే..!

డైరెక్టర్ గా తమకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న వారు ఉన్నారు. కానీ ఈతరం దర్శకుల్లో వారి సినిమాల్లోని హీరో పాత్రలతో డైరెక్టర్ పేరు గుర్తొచ్చేలా చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:15 AM GMT
ఇది సార్ డైరెక్టర్ బ్రాండ్ అంటే..!
X

తెర మీద కనిపించే హీరోలను చూసే థియేటర్ కు ఆడియన్స్ వస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ తెర వెనుక సినిమా నడిపించే నాయకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ చేసే కసరత్తు గురించి కొందరికే తెలుసు. అయితే కొందరు డైరెక్టర్స్ తెర వెనుక పనిచేసినా వారి ప్రభావం తెర మీద కనిపిస్తుంది. డైరెక్టర్ గా తమకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న వారు ఉన్నారు. కానీ ఈతరం దర్శకుల్లో వారి సినిమాల్లోని హీరో పాత్రలతో డైరెక్టర్ పేరు గుర్తొచ్చేలా చేసుకున్నారు.


అలా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ని చూసి డైరెక్టర్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ముందు ఉంటాడు. అర్జున్ రెడ్డితో అతను సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి మరో పోటుగాడు వచ్చాడని అనుకోగా అతను మన దర్శకులకే కాదు బాలీవుడ్ మేకర్స్ కి చెక్ పెడతాడని యానిమల్ చూశాక అర్థమైంది.

యానిమల్ సినిమాలో హీరో యాటిట్యూడ్ చూస్తే సందీప్ వంగ డైరెక్షన్ లెవెల్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. సినిమా నచ్చని వాళ్లంతా ఇల్లిటరేట్స్ అనే దమ్ము మరే డైరెక్టర్స్ కి ఉండదు కావొచ్చు.

ఇక ఇదే కాన్ఫిడెంట్ తో సినిమాలు తీస్తున్న మరో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అతని సినిమా అంటే చాలు సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూసేలా చేసుకున్నాడు. విక్రం లో కమల్ క్యారెక్టర్, లియోలో విజయ్ క్యారెక్టరైజేషన్ లోకేష్ సినిమాటిక్ పవర్ ని తెలియ చేశాయి. ఈ సినిమాల వల్ల ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాల మీద ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ ఉంది.

డైరెక్టర్ గా తన సత్తా చాటడమే కాదు సినిమాతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడంలో మరో కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు కూడా ఇక్కడ ప్రస్తావించ వచ్చు. సూపర్ స్టార్ రజినికాంత్ తో అతను తీసిన జైలర్ సినిమా రజిని ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా చేసింది. కొంతకాలంగా రజిని సరైన సక్సెస్ లు అందుకోని టైం లో నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ గా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా చేశాడు. ఆ సినిమాలో రజిని క్యారెక్టరైజేషన్ కూడా ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంది.

ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్స్ చేస్తున్న సినిమాల్లో హీరోల పాత్రలతో వారెవా అనిపిస్తున్నారు. అంతేకాదు తమకంటూ డైరెక్టర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇవే కాదు వీరి నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కచ్చితంగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని చెప్పొచ్చు.