Begin typing your search above and press return to search.

దీపావ‌ళి 2023 వేడుక‌ల్లో టాప్ సౌత్ జంట‌లు

ఈ ప్రత్యేకమైన రోజున తమ అభిమాన తెలుగు తార‌ల్లో క‌పుల్స్ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ గురించి ఏం జ‌రుగుతుందో ఆరా తీస్తున్నారు. అలాంటి వారికి అంద‌మైన జంట‌ల దీవాళి సంబ‌రం గురించిన స‌మాచారం.

By:  Tupaki Desk   |   12 Nov 2023 9:51 AM GMT
దీపావ‌ళి 2023 వేడుక‌ల్లో టాప్ సౌత్ జంట‌లు
X

ఈ దీపావళికి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా విడుదలలు ఏమీ లేవు. అయినా ఇప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల‌ను ఆస్వాధించే మూడ్ లో ఉన్నారు తెలుగు యూత్. అంత‌కంటే ముందే.. ఈ ప్రత్యేకమైన రోజున తమ అభిమాన తెలుగు తార‌ల్లో క‌పుల్స్ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ గురించి ఏం జ‌రుగుతుందో ఆరా తీస్తున్నారు. అలాంటి వారికి అంద‌మైన జంట‌ల దీవాళి సంబ‌రం గురించిన స‌మాచారం.

లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్


న‌వ‌ వధూవరులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి తమ మొదటి దీపావళిని జరుపుకుంటున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట నవంబర్ 1న ఇటలీలో విలాసవంతమైన వేడుకలో ఒక‌ట‌య్యారు. ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తెలుగు చిత్రం 'అంతరిక్షం 9000 KMPH'లో వారి కలయికలానే వరుణ్ - లావణ్యల ప్రేమ కథ వికసించింది. తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ గత జూన్‌లో హైదరాబాద్‌లో తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 1న జరిగిన గ్రాండ్ ఇటాలియన్ వివాహానికి వరుణ్ తేజ్ కజిన్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ప్రముఖ నటులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ స్టార్స్‌తో కలిసి నిల్చున్న వైరల్ పెళ్లి ఫోటోలు అభిమానుల హృదయాలను కొల్లగొట్టాయి. ఈ దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వ‌రుణ్-లావ‌ణ్య పెళ్లి త‌ర్వాత‌ తమ మొదటి ప్ర‌ధాన వేడుక‌గా దీపావ‌ళిని జరుపుకుంటున్నారు.

నయనతార - విఘ్నేష్ శివన్


నయనతార - విఘ్నేష్ శివన్ 9 జూన్ 2022న పెళ్లి ప్రమాణాల‌తో ఒక‌ట‌య్యారు. ఈ జంట గత ఏడాది అక్టోబర్ 9న తమ కవల పిల్లలు ఉలాగ్- ఉయిర్‌ల రాకను ఆనందంగా ప్రకటించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్‌లో వీరి ప్రేమకథ మొదలైంది. గత ఏడేళ్లుగా నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఇటీవలి వివాహానికి సంబంధించిన‌ పత్రాలు ప‌రిశీలించ‌గా, వారు అధికారికంగా తమ వివాహాన్ని 2016లో నమోదు చేసుకున్నారని సూచించాయి. ప్ర‌తి యేటా ఈ జంట దీపావ‌ళిని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేస్తోంది. ఈ దీపావళికి వారి ఇంట ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే వారు తమ చిన్న పిల్లలతో కలిసి రెండవ సారి ఈ పండుగ‌ను వైభ‌వంగా జరుపుకుంటున్నారు. వారి ప్రయాణంలో ఒక అందమైన అధ్యాయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ


ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ..'యాగవరాయినుమ్ నా కాక్క'..'మరగధ నాయనం' వంటి చిత్రాలలో సహతారలు..మార్చి 24న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీలో ఇద్ద‌రూ పండిపోయారు. చివ‌రికి పెళ్లితో నిజ జీవితంలో నిబద్ధతకు క‌ట్టుబ‌డ్డారు. ఆది పినిశెట్టి ప‌లు చిత్రాల్లోప్రతినాయకుడి పాత్రలతోను పాపుల‌ర‌య్యాడు., మే 2022న చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో నటి నిక్కీ గల్రానీతో ఆది వివాహం జరిగింది. ఈ వివాహం సన్నిహిత ఎఫైర్ గా జరిగింది. పెళ్లికి కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు హాజ‌రు కాగా ఘనంగా జరిగింది. పెళ్లి అనంత‌రం ఈ జంట అన్యోన్య దాంప‌త్యం కొన‌సాగిస్తోంది.

నాగ శౌర్య- అనూష శెట్టి


నాగ శౌర్య తన మొదటి దీపావళిని జరుపుకున్నాడు. అతడి చిరకాల స్నేహితురాలు కం భార్య అయిన అనూషా శెట్టితో మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు. నవంబర్ 2022లో బెంగుళూరులో అంగరంగ వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్నారు. సంప్రదాయ విధానంలో జ‌రిగిన‌ ఈ పెళ్లి వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేయడంతో చర్చనీయాంశంగా మారాయి. ఛ‌లో, కృష్ణ బృందా విహారి, ల‌క్ష్య వంటి చిత్రాల్లో విభిన్న మైన పాత్రలతో అత‌డు ఆక‌ట్టుకున్నాడు. ప్రస్తుతం SS అరుణాచలం దర్శకత్వంలో తన త‌దుప‌రి ప్రాజెక్ట్ NS24లో పని చేస్తున్నాడు. ఈ దీపావళి దంపతులు తమ పండుగ .. మొదటి వార్షికోత్సవాన్ని కలిసి సెల‌బ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ దీపావ‌ళి ప్రాముఖ్యతను కలిగి ఉంది.

హన్సిక మోత్వాని- సోహెల్ కతురియా


హన్సిక మోత్వాని సోహెల్ కతురియాతో డిసెంబర్ 4న వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. వివాహానంత‌రం హ‌న్షిక త‌మ ప్రేమాయ‌ణం ఎలా ప్రారంభ‌మైందో వెల్ల‌డించింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త క‌తూరియా దుబాయ్ లో సెటిల‌య్యారు. హన్సిక అత‌డితో క‌లిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో భాగస్వామి. అత‌డు హ‌న్షిక‌ను ప్రేమించి పెళ్లాడాడు. అయితే ఈ జంట‌ వివాహంపై విమర్శలను ఎదుర‌య్యాయి. కానీ అన్నిటికీ హ‌న్షిక ఒక వీడియో సందేశం ద్వారా క్లారిటీనిచ్చింది. ఈ జంట పెళ్లి వీడియో కూడా అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగా మారింది. ఈ దీపావళి అంద‌మైన వేడుకుల‌కు ఈ జంట ఇల్లు నిల‌యంగా మార‌నుంది.

నేచుర‌ల్ స్టార్ నాని- అంజ‌నా ఎల‌వ‌ర్తి, నితిన్ -షాలిని కందుకూరి, నిఖిల్ - డా.ప‌ల్ల‌వి వ‌ర్మ‌, ద‌గ్గుబాటి రానా- మిహీక బ‌జాజ్ వంటి జంట‌లు కూడా త‌మ కుటుంబంతో దీపావ‌ళి వేడుక‌ల్ని వైభ‌వంగా జ‌రుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో అద్భుత‌మైన పార్టీతో మెగాస్టార్ చిరంజీవి దీపావ‌ళి సెల‌బ్రేష‌న్ ని ప్రారంభించారు. నంద‌మూరి, అక్కినేని కుటుంబాల్లోను దీపావ‌ళి వేడుక‌లు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి.