Begin typing your search above and press return to search.

సౌత్‌ క్రేజీ బ్యూటీకి టాలీవుడ్‌ లో ఘోర అవమానం

తాజాగా చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్ కు జోడీగా నటించిన ఈ అమ్మడు ఒక వైపు మలయాళం మరియు వైపు తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది

By:  Tupaki Desk   |   27 Nov 2023 6:01 AM GMT
సౌత్‌ క్రేజీ బ్యూటీకి టాలీవుడ్‌ లో ఘోర అవమానం
X

కోలీవుడ్ మరియు మాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ బిజీ హీరోయిన్స్ లో మహిమ నంబియర్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి, చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది స్టార్స్ కి జోడీగా నటించి అరుదైన రికార్డ్‌ ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌ లో ఘోర అవమానం జరిగిందట.

తాజాగా చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్ కు జోడీగా నటించిన ఈ అమ్మడు ఒక వైపు మలయాళం మరియు వైపు తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ వచ్చినట్లే వచ్చి మిస్ అయిందని మహిమ చెప్పుకొచ్చింది.

తాజాగా మహిమ నంబియర్ ఒక చిట్ చాట్‌ లో... తెలుగులో ఒక యంగ్‌ స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్స్‌, టెస్ట్‌ షూట్‌ పూర్తి అయింది. నాలుగు రోజుల రెగ్యులర్‌ షూట్‌ కూడా జరిపారు. ఆ తర్వాత షూటింగ్‌ కు బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆ సినిమా మేనేజర్‌ ఫోన్ చేసి నన్ను సినిమా నుంచి తగ్గిస్తున్నట్లు చెప్పాడు.

మా సినిమాకు ఒక స్టార్‌ హీరోయిన్‌ ఓకే చెప్పింది. మా హీరోకి, కథ కి ఆమె సెట్‌ అనుకుంటున్నామని ఆయన అన్నాడు. అందుకే నిన్ను తప్పిస్తున్నాం అని కూడా చెప్పాడు. ఆయన మాటలు నాకు బాధ ను కలిగించాయి. చాలా అవమానంగా అనిపించింది. ఎంపిక చేసిన నన్ను తొలగించి మరో హీరోయిన్‌ తో చేయించడం అనేది నన్ను అవమానించడం అనిపించింది అని మహిమ ఆవేదన వ్యక్తం చేసింది.

ముందు ముందు టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తే చేస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు తప్పకుండా మంచి పాత్రలు వస్తే ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి ఈ క్రేజీ బ్యూటీ ని తెలుగు లో తీసుకు వచ్చే దర్శకుడు, హీరో ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.