రెమ్యునరేషన్‌లోనూ బాలీవుడ్‌ని తొక్కేశామా?
ఇండియన్ సినిమా అంటే తామేనని ఇన్నాళ్లూ గొప్పలు పోయిన బాలీవుడ్ పరిస్థితి కరోనా తరువాత మారింది. నేలవిడిచి సాము చేసిన బాలీవుడ్ ఇప్పుడు నేల చూపులు చూస్తోంది.
By: Tupaki Desk | 15 May 2025 10:00 PM ISTఇండియన్ సినిమా అంటే తామేనని ఇన్నాళ్లూ గొప్పలు పోయిన బాలీవుడ్ పరిస్థితి కరోనా తరువాత మారింది. నేలవిడిచి సాము చేసిన బాలీవుడ్ ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణాదిని చూసి తీవ్ర ఇబ్బందిపడుతోంది. వందల కోట్ల బడ్జెట్‌లతో సినిమాలు చేస్తూ మనకు మించిన హిట్‌లని సొంతం చేసుకుంటున్నారని, ఉత్తరాది మార్కెట్‌ని కూడా కొల్లగొట్టేస్తున్నారని ఏడుస్తోంది. దానికి ఆజ్యం పోస్తూ మన వాళ్లు మరో విషయంలోనూ బాలీవుడ్‌ని డామినేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అదే రెమ్యునరేషన్. యస్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో మన వాళ్లు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుంటూ దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు వంద కోట్ల కలెక్షన్‌లు అంటే బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యం కానీ ట్రెండ్ మారింది. బాల్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కోర్ట్‌లోకి వచ్చేసింది. మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లని రాబడుతున్నాయి.
మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లోనూ భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతున్నాయి.దీంతో మన సౌత్‌లో నిర్మించే సినిమాల బడ్జెట్‌లు రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో మన స్టార్లు కూడా అందుకు తగ్గట్టుగా వారి వారి రెమ్యునరేషన్‌లు పెంచేశారు. ఒక్కో సౌత్ స్టార్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్లని ఈ విషయంలో డామినేట్ చేస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సినిమాకు రూ.300 కోట్లు (ప్రాఫిట్‌తోకలిపి) పారితోషికం తీసుకుంటున్నారు. ఇక దళపతి విజయ్ కూడా తక్కువే కాదు. భారీగానే డిమాండ్ చేస్తున్నాడు. తను ఒక్కో మూవీకి లాభాల్లో వాటాతో కలిపి రూ.270 కోట్లు (జన నాయగన్) డిమాండ్ చేశాడు. అల్లు అర్జున్ కూడా భారీగా పెంచేశాడు. అట్లీ మూవీకి ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను రూ.180 కోట్లు తీసుకుంటున్నాడు.
మహేష్ బాబు కూడా పెంచేసినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి ప్రాజెక్ట్‌కు మహేష్ డిమాండ్ చేస్తున్న అమౌంట్ రూ.180 కోట్లు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ `డ్రాగన్` కోసం ఎన్టీఆర్ రూ.150 కోట్లు తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ `పెద్ది` కోసం రూ.120 కోట్లు తీసుకుంటున్నాడు. ఇలా మన సౌత్ స్టార్లలో ఎవరిని తీసుకున్నా వంద కోట్లకు పైనే తీసుకుంటుండటంతో ఈ విషయంలో కూడా బాలీవుడ్ స్టార్లు వెనుకబడినట్టుగా తెలుస్తోంది.
