క్రేజీ మూవీస్..సౌత్ స్టార్స్ డబుల్ ధమాకా!
మన వాళ్లు డబుల్ రోల్‌లో సందడి చేయడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అఆ చేసిన ఆసినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేశాయి.
By: Tupaki Desk | 11 July 2025 12:35 PM ISTమన వాళ్లు డబుల్ రోల్‌లో సందడి చేయడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అఆ చేసిన ఆసినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేశాయి. దాంతో ద్యుయెల్ రోల్ మూవీస్ చేయడానికి మన హీరోలు ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుఉ, అభిమానులు కూడా ఈ తరహా సినిమాలని ప్రత్యేకంగా ఆదరిస్తుండగంతో హీరోల్లో డ్యుయెల్ రోల్‌లపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. తాజాగా ప్రేక్షకాభిమానులని డబుల్ ధమాకాతో అలరించడానికి మన హీరోలు రెడీ అవుతున్నారు. అవేంటన్నది ఇప్పడు చూద్దాం.
ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. `అఖండ` అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు `అఖండ 2` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య మరో సారి డబుల్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇక ఇదే తరహాలో డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నాడు. తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ది రాజా సాబ్`. పీపుల్ మీడియా బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ కామెడీ హారర్ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి, కల్కి సినిమాల తరువాత ప్రభాస్ డ్యుయెల్‌రోల్ చేస్తున్న సినిమా కావడం, రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండటంత ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
అల్లు అర్జున్ కూడా ఈ సారి డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నాడు. `పుష్ప 2` బ్లాక్ బస్టర్ తరువాత తను అట్లీతో కలిసి పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో బన్నీ ఫస్ట్ టైమ్ డ్యుయెల్ రోల్‌లో కనిపించి సందడి చేయబోతున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న, దీపకా పదుకునే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్‌లతో పాటు పలువురు కీలక నటీనటులు నటిస్తున్నారు.
వీరితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మరోసారి డబుల్ ధమాకాకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో `డ్రాగన్` చేస్తున్న ఎన్టీఆర్ త్వరలో `దేవర 2`లో మరోసారి డ్యుయెల్ రోల్‌లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా డ్యుయెల్ రోల్‌కి సై అంటున్నాడు. రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్‌లో చేయబోతున్న పీరియాడిక్ మూవీలో విజయ్ దేవరకొండ డ్యుయెల్ రోల్‌లో కనిపించి సందడి చేస్తాడట.
కోలీవుడ్ స్టార్ కార్తీ కూడా డ్యెయెల్ రోల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తను నటించిన `సర్దార్` బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం దానికి సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తి తండ్రి కొడుకులుగా డ్యుయెల్ రోల్‌లో కనిపించి మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నాడు. ఈ ఏడాది దీపావళికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి కూడా మరోసారి డ్యుయెల్ రోల్‌లో కనిపించి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. తను అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో డ్యుయెల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా `పెద్ది`తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడని, ఇందులో తను ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలిసింది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ `డ్రాగన్`లోనూ డ్యుయెల్ రోల్‌తో మెస్మరైజ్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
