ఇండస్ట్రీలో వారసుల జోరు అదిరేలా!
ఇండస్ట్రీలో వారసుల జోరు మళ్లీ ఊపందుకుంది. వివిధ చిత్ర పరిశ్రమల నుంచి వారసులు తెరంగేట్రం చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 4:00 AM ISTఇండస్ట్రీలో వారసుల జోరు మళ్లీ ఊపందుకుంది. వివిధ చిత్ర పరిశ్రమల నుంచి వారసులు తెరంగేట్రం చేస్తున్నారు. నటులుగా, దర్శకులుగా నచ్చిన విభాగాల్లో రాణించడానికి రెడీ అవుతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే... సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. బాబాయ్ మహేష్ పెద్ద స్టార్..తండ్రి రమేష్ బాబు కూడా కొన్ని సినిమాలు చేసారు. కానీ నటుడిగా కొనసాగలేదు. ఈనేపథ్యంలో తాతయ్య, బాబాయ్ వారసత్వంతో జయకృష్టం ఎంట్రీ షురూ చేసాడు.
ఈ చిత్రానికి `ఆర్ ఎక్స్ 100` ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జయకృష్ణ ఎంట్రీ విషయంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. తండ్రి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత మహేష్ పై ఉన్న నేపథ్యంలో జయకృష్ణ కు సంబంధించి మహేష్ అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోలీవుడ్ నుంచి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా లాంచ్ అవుతున్నాడు. `ఫినిక్స్` చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.
స్టంట్ డైరెక్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై లో సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే జాసన్ హీరోగా కాకుండా డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నాడు. విజయ్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు? అనుకుంటే తండ్రి ప్రయాణానికి భిన్నంగా జాసన్ జర్నీ మొదలైంది.
పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత తండ్రినే డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. క్రియేటివ్ గా వెళ్లాలనే ఈ శాఖను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నందమూరి హరికృష్ష కుమారుడు జానకీ రామ్ తనయుడు ఎన్టీఆర్ కూడా తెరంగేట్రం చేస్తున్నాడు. వై. వి.ఎస్ చౌదరి ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ తనయ విస్మయ మోహన్ లాల్ `తుడక్కం` అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తుంది.
ఈ చిత్రాన్ని మోహన్ లాల్ తన సొంత నిర్మాణ సంస్థ అశీర్వద్ సినిమాపై నిర్మిస్తున్నారు. `2018` ఫేం జూడ్ అంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. `తుడక్కం` ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇటీవలే పట్టాలెక్కింది. ఇలా కొంత మంది వారసుల ఎంట్రీతో ఇండస్ట్రీ కి కొత్త కళ రాబోతుంది.
