Begin typing your search above and press return to search.

2026లో అదిరిపోయే కం‌బ్యాక్ ఇచ్చిన సౌత్, నార్త్ హీరోలు!

2026 నాటి చరిత్రను పరిశీలిస్తే సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు అగ్ర కథానాయకులు వరుస ప్లాపుల నుంచి తేరుకుని ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ఖతర్నాక్ కంబ్యాక్ ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   6 Sept 2026 12:00 AM IST
2026లో అదిరిపోయే కం‌బ్యాక్ ఇచ్చిన సౌత్, నార్త్ హీరోలు!
X

చిత్ర పరిశ్రమలో గెలుపోటములు సహజం. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు ఆ హీరో పనైపోయింద‌ని విమర్శ కులు పెదవి విరిచిన వేళ తమ అసలైన స్టామినాతో తిరిగి పుంజుకోవడమే నిజమైన స్టార్‌డమ్. 2026 నాటి చరిత్రను పరిశీలిస్తే సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు అగ్ర కథానాయకులు వరుస ప్లాపుల నుంచి తేరుకుని ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ఖతర్నాక్ కంబ్యాక్ ఇచ్చారు.

మాస్ మహారాజా రవితేజకు ఇటీవల ఎదురైన కొన్ని పరాజయాల తర్వాత ఆయన మార్కెట్ తగ్గిందనే విమర్శలు వినిపించాయి. అయితే ఆ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ ఆయన నటించిన `ఇరుముడి` చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లకు ఏకంగా 100 కోట్ల నికర లాభాలను తెచ్చిపెట్టి రవితేజ మాస్ పవర్‌ను మరోసారి నిరూపించింది.

కోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య సైతం కొన్ని ప్లాపుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ 2026 ఆయన కెరీర్‌లోనే గోల్డెన్ ఇయర్‌గా నిలిచింది. సూర్య నటించిన `కరుపు` బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల అసాధారణ వసూళ్లను పాధించింది. ఆ వె వెంటనే రిలీజ్ అయిన `విశ్వనాథ్ అండ్ సన్స్` 240 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇలా ఒకే ఏడాదిలో రెండు భారీ హిట్ల ద్వారా సూర్య పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు.

మాలీవుడ్ లో `ప్రేమమ్` చిత్రంతో సంచలనం సృష్టించిన నివిన్ పౌలీ ఆ తర్వాత సరైన విజయం లేక వెనుకబడ్డారు. అయితే ఆయన కథానాయకుడిగా వచ్చిన `బెత్లహం కుటుంబ యూనిట్` చిత్రం మాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వసూళ్లతో నివిన్ పౌలీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

బాలీవుడ్‌లో కూడా ఒకప్పటి మాస్ హీరో ఇమ్రాన్ హాష్మీ రీ-ఎంట్రీ సరికొత్త చరిత్రను తిరగరాసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటించిన `ఆవారాపన్ 2` చిత్రం థియేటర్లలో సరికొత్త ఊపును తీసుకొచ్చింది. తన మార్కు డైలాగ్ డెలివరీ, మ్యూజిక్, నటనతో ఇమ్రాన్ హాష్మీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ మాస్ కంబ్యాక్‌ను నమోదు చేశారు. అలా నలుగురు హీరోల‌కు 2026 మ‌రో మైలురాయిగా నిలిచిపోతుంది. సరైన కథ, పాత్ర పడితే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని సాధించిన విజయాలు నిరూపించాయి. విమర్శించిన నోళ్లే ప్రశంసలు కురిపించాయి.