ఫ్యామిలీ బ్యూటీ హార్ట్ బీట్ పెంచుతోందే!
తాజాగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' లో నటించిన యోగలక్ష్మి అంతే ప్రేమను పొందుతుంది. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది.
By: Tupaki Desk | 12 Jun 2025 2:00 AM ISTనేచురల్ బ్యూటీలను తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆరాదిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. అందులో నూ సౌత్ లో తమిళ్, కర్నాటక, కేరళ నుంచి ఏ భామ లాంచ్ అయినా వాళ్లను ఆదరించడంలో ఎంతో చొరవ చూపిస్తున్నారు. ఒకప్పుడు ముంబై బ్యూటీలపై చూపించే అభిమానమంతా ఒక్కసారిగా సౌత్ భామ లపై మళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో సౌత్ భామల పోటీని ఉత్తరాది భామలు తట్టుకోలేకపోతున్నారు.
ఓటీటీ సీరిస్ లనుంచి లాంచ్ అయ్యే సౌత్ భామలకు అంతే ఆదరణ దక్కుతుంది. తాజాగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' లో నటించిన యోగలక్ష్మి అంతే ప్రేమను పొందుతుంది. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో యోగక్ష్మీ పాత్ర చిన్నదే అయినా కనిపించినంత సేపు అందంతో ఆకట్టుకుంది. నేచురల్ అందంతా అలరించింది. మంచి పెర్పార్మర్ అనిపించింది.
అమ్మడి నటనకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. దీంతో ఎవరీ బ్యూటీ అంటూ ఇంటర్నెట్ సెర్చ్ చే యడం మొదలు పెట్టారు. పెద్దగా సమాచారం దొరకలేదు గానీ ఈసినిమా కంటే ముందే 'హార్ట్ బీట్', 'సింగప్నే' అనే వెబ్ సిరీస్ ల్లో నటించింది. ఈ రెండు సిరీస్ లు పెద్దగా ఆడలేదు. ఈ మధ్యనే యూట్యూబ్ లో రిలీజ్ అయిన 'మ్యాచ్ ఫిక్సింగ్' అనే షార్ట్ పిల్మ్ లో నటించింది.
అంతకు మించి ఈ బ్యూటీకి సంబంధించిన సమాచారం లేదు. కానీ నటిగా మంచి ప్యూచర్ కనిపిస్తుంది. అమ్మడి ట్యాలెంట్ ను గుర్తించి చాలామంది అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ స్టాలో మాత్రం కొన్ని ఫోటోలు..వీడియోలు వైరల్ అవుతున్నాయి.
