భరత నాట్యం డ్యాన్సర్ తో సింగర్ పెళ్లి
అయితే ఇప్పుడు సింగర్ విఘ్నేశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. విఘ్నేశ్ ఓ భరత నాట్యం డ్యాన్సర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు.
By: Tupaki Desk | 20 May 2025 1:28 PM ISTసౌత్ ఇండియన్ సింగర్ విఘ్నేశ్ అందరికీ సుపరిచితుడే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని సినిమాల్లో ఎన్నో సాంగ్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ తన పాటలతో సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. విఘ్నేశ్ కేవలం సింగర్ మాత్రమే కాదు. అతను పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్ గా కూడా పని చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
పలు ర్యాప్ సాంగ్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న విఘ్నేశ్ తమిళంలో హారీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎక్కువ సాంగ్స్ పాడాడు. తమన్, శ్యామ్ సీఎస్ జస్టిన్ ప్రభాకరన్, డి. ఇమాన్, సత్య లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలకు కూడా విఘ్నేశ్ ట్రాక్స్ పాడాడు. తెలుగులో కూడా విఘ్నేశ్ ఎన్నో మంచి మంచి పాటలు పాడి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే ఇప్పుడు సింగర్ విఘ్నేశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. విఘ్నేశ్ ఓ భరత నాట్యం డ్యాన్సర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె పేరు శ్వేత ఆనంద్. శ్వేత చెన్నైలో పుట్టింది. చెన్నైలో పుట్టినప్పటికీ శ్వేత ఫ్యామిలీ కెనడాలో ఉంటుండటంతో ఆమె కూడా అక్కడే ఉంటుంది. శ్వేత కు భరతనాట్యం మాత్రమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్, మృదంగం కళాకారిణి, వయోలిస్ట్ కూడా. అయితే శ్వేత- విఘ్నేశ్ పెళ్లి జూన్ 5న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా వారే మీడియాకు తెలిపారు.
