Begin typing your search above and press return to search.

మ‌న సూప‌ర్‌ హీరోల్ని చూసి విజిల్స్ వేస్తాను: నాగార్జున‌

ఒక వ్యక్తి తన పిడికిలిని పైకి ఎత్తితే 20 మంది పడిపోతారు.. అది అసాధారణంగా కనిపిస్తుంది! అని మీరు అనవచ్చు.

By:  Tupaki Desk   |   3 May 2025 9:00 AM IST
మ‌న సూప‌ర్‌ హీరోల్ని చూసి విజిల్స్ వేస్తాను: నాగార్జున‌
X

ప్ర‌భాస్ - బాహుబ‌లి, య‌ష్ - కేజీఎఫ్‌, అల్లు అర్జున్ - పుష్ప .. భార‌త‌దేశంలో పాన్ ఇండియ‌న్ హిట్ చిత్రాలుగా సంచ‌ల‌నాలు సృష్టించాయి. ఈ సౌత్ సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాయి. న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కింది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాల‌న్నీ మాతృభాష‌లో కంటే హిందీ బెల్ట్ లో భారీ వ‌సూళ్ల‌ను సాధించాయి. తాజాగా వేవ్స్ 2025 స‌మ్మిట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. తాను థియేట‌ర్ల‌లో ఇలాంటి సినిమాలు, పాత్ర‌ల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు.

`పుష్ప` సినిమాలు రెండూ తెలుగులో కంటే ఉత్తరాదిలో ఎక్కువ డబ్బు సంపాదించాయి. పుష్ప లాంటి కథలను మనం ఇంతకు ముందు తెలుగులో చూశాము. కానీ పుష్ప సినిమాలో లార్జ‌ర్ దేన్ లైఫ్ హీరో క‌నిపించాడు. ఉత్తరాదిలో - బీహార్, యుపి, పంజాబ్ ప్ర‌జ‌లు పుష్పరాజ్ .. కెజిఎఫ్ రాకీభాయ్ .. బాహుబలి వంటి లార్జ‌ర్ దేన్ లైఫ్ హీరోల‌ను చూడాలనుకున్నారు. భార‌తీయ ప్ర‌జ‌లు ఒత్తిళ్ల‌ను అధిగ‌మించేందుకు సినిమా తెర‌ల‌పై మాయాజాలాన్ని చూడాల‌నుకుంటున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో పాటు మంచి క‌థ‌ను జోడించి సినిమాలు తీస్తే బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాలు సాధించ‌డం సాధ్య‌మేన‌ని నాగ్ అన్నారు. రాజ‌మౌళి బాహుబ‌లి కోసం దీనినే అనుస‌రించాడు. అత‌డు మూలాల్ని మ‌రిచి దూరంగా వెళ్లలేదు. మ‌న మూలాలు, భాష గురించి చాలా గ‌ర్వ‌ప‌డ్డాడు. దానిని తెలుగు సినిమా లాగా చిత్రీకరించాడు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దానిని ఇష్టపడ్డారు! మీరు మీ కథ చెప్పే విధానంలో స‌త్తా చాట‌డం చాలా ముఖ్యం అని అన్నారు.

ఒక వ్యక్తి తన పిడికిలిని పైకి ఎత్తితే 20 మంది పడిపోతారు.. అది అసాధారణంగా కనిపిస్తుంది! అని మీరు అనవచ్చు. కానీ మీరు మార్వెల్ లేదా DC సినిమాలను ఇష్టపడితే సూపర్‌మ్యాన్ కూడా అదే చేస్తాడు. కానీ అవి వారికి సూపర్ పవర్స్ ఉన్నాయనే లాజిక్‌ను ఇస్తాయి. కానీ మన(సినిమా)కు ఆ ప్రత్యేక శక్తులు అవసరం లేదు! అని నాగార్జున అన్నారు. నాతో స‌హా టికెట్ కి డ‌బ్బు చెల్లించే ప్ర‌తి సామాన్యుడు త‌మ హీరోల్ని లార్జ‌ర్ దేన్ లైఫ్ హీరోలుగా చూడాల‌నుకుంటున్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్ స‌హా మ‌న హీరోల న‌ట‌న‌ను చూసి చ‌ప్ప‌ట్లు కొడుతూ ఈల‌లు వేస్తాను అని నాగ్ అన్నారు.