Begin typing your search above and press return to search.

పాన్ వరల్డ్ రేంజ్ లో మనోళ్ల సినిమాలు.. డైరెక్టర్స్ టార్గెట్ అదే!

దీంతో ఇప్పుడు కొందరు దర్శకులు.. కూడా ఇప్పుడు ఇండియాకు మాత్రమే కాకుండా.. తమ సినిమాలను వరల్డ్ వైడ్ రేంజ్ లోకి తీసుకెళ్లారని యోచిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   9 April 2025 1:48 PM IST
పాన్ వరల్డ్ రేంజ్ లో మనోళ్ల సినిమాలు.. డైరెక్టర్స్ టార్గెట్ అదే!
X

పాన్ ఇండియా ట్రెండ్ కొన్నాళ్ల క్రితం మొదలై.. మొత్తం అన్ని ఇండస్ట్రీలకు స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. అనేక భాషల్లో పలువురు మేకర్స్.. పాన్ ఇండియా లెవెల్ లో మూవీలు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయా సినిమాల్లో నటించిన క్యాస్టింగ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా నేషనల్ వైడ్ లో తమకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు.

అలా మన తెలుగు హీరోలకు కూడా పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ కు వెళ్లారు మన హీరోలు, డైరెక్టర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిన ఆ మూవీ.. ఎలాంటి హిట్ అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.

పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో కూడా తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ఇప్పుడు కొందరు దర్శకులు.. కూడా ఇప్పుడు ఇండియాకు మాత్రమే కాకుండా.. తమ సినిమాలను వరల్డ్ వైడ్ రేంజ్ లోకి తీసుకెళ్లారని యోచిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు తగట్లే ప్లాన్ చేసుకుని.. కథలు రాసుకుని గ్లోబల్ రేంజ్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారని టాక్.

అయితే ఇప్పటికే ఆ గ్లోబల్ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలనుకున్న మూడు సినిమాలు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో రెండు నిర్మాణ దశలో ఉన్నాయట. వాటి షూటింగ్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి! మరో సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను పాన్ వరల్డ్ రేంజ్ లో రానున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్.. అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కచ్చితంగా గ్లోబల్ ఆడియన్స్ ను మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకున్నారట డైరెక్టర్స్.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మూవీ లవర్స్ ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. టాలీవుడ్ రేంజ్.. గ్లోబల్ కు చేరిందని కామెంట్లు పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ కు మించిన విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతూ.. వెయిటింగ్ ఫర్ మూవీస్ అని అంటున్నారు.