సమస్య ఏదైనా తగ్గేదేలే అంటున్న హీరోయిన్లు
కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా తాము స్ట్రాంగే అని నిరూపిస్తున్నారు మన హీరోయిన్లు. వారిలో నభా నటేష్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, రష్మిక ఉన్నారు.
By: Tupaki Desk | 4 April 2025 1:00 AM ISTఎలాంటి సమస్యనైనా, ఎన్ని ఇబ్బందులనైనా ధైర్యం, సంకల్పంతో ఎదుర్కోవచ్చని చాటి చెప్తున్నారు సౌత్ హీరోయిన్లు. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా తాము స్ట్రాంగే అని నిరూపిస్తున్నారు మన హీరోయిన్లు. వారిలో నభా నటేష్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, రష్మిక ఉన్నారు.
ఒక ఆరు నెలల ముందు జిమ్ లో 80 కేజీలు బరువు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా గాయపడింది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న గాయమే కదా తగ్గిపోతుందనుకుని ముందు దాన్ని అశ్రద్ధ చేసిందట రకుల్. కానీ ఉండేకొద్దీ ఆ ప్రాబ్లమ్ చాలా పెద్దదైందని, దాని వల్ల ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని, ఆరు నెలలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్తోంది. అయితే దాని తీవ్రత గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గిందని, మెల్లిగా ఇప్పుడు తన పనులు తాను చేసుకోగలుగుతున్నానని, అన్నీ సిట్యుయేషన్స్ మనకు అనుకూలంగానే ఉండవని, కొన్నిసార్లు మన మైండ్, బాడీ మనకు ఏవో చెప్పడానికి ట్రై చేస్తాయని వాటిని వింటూ ఆ దారిలో నడవాలని ఏదీ అతిగా చేయకూడదని, అప్పుడే మంచి ఆరోగ్యం దక్కుతుందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్ కొన్నాళ్ల కిందట యాక్సిడెంట్ కు గురై తీవ్రంగా గాయపడింది. దీంతో సినిమాలకు దూరమవాల్సి వచ్చింది నభా. ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకున్న నభా, మళ్లీ వరుస సినిమాలతో అలరించడానికి రెడీ అవుతోంది. రెస్ట్ తీసుకున్న టైమ్ లో సమయం విలువ తెలిసిందని, ఆ టైమ్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నభా తెలిపింది.
ఇక సమంత మయోసైటిస్ సమస్యతో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. ఆ వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకోవడానికే సమంత సినిమాల నుంచి గ్యాప్ కూడా తీసుకుంది. సిటాడెల్ సెట్స్ లో ఆ వ్యాధి వల్ల ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయిందట సమంత. ఎలాగైనా ఆ ప్రాజెక్టు పూర్తైతే చాలని ఎన్నో సార్లు అనుకున్నానని చెప్తున్న సమంత ఇప్పుడు ఆ సమస్య నుంచి పూర్తిగా కోలుకుని వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతూ నిర్మాతగా కూడా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టి సత్తా చాటాలని చూస్తుంది.
వీరంతా ఒకెత్తయితే రష్మిక మరింత స్పెషల్. కాలికి గాయమైనా కట్టు కట్టుకుని, నడవలేకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లుంది. నడవలేని సిట్యుయేషన్ లో ఉన్నా వీల్ ఛైర్ లో ఉండి కూడా సినిమా ప్రమోషన్స్ కు హాజరై అందరినీ ఆశ్చర్యపరించి. ఆ కాలి గాయం మరో 9 నెలల పాటూ అంతే ఉంటుందని, అందుకే అది తగ్గేవరకు వెయిట్ చేయకుండా కమిట్ అయిన వర్క్స్ ను పూర్తి చేస్తున్నానని రష్మిక అంటోంది. కాలు బాలేకపోయినా రష్మిక ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తీరు అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుందని రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కూడా ఆమెను పొగిడిన సంగతి తెలిసిందే.
