సౌత్ భామలంతా వరుసగా కొట్టాల్సిందే!
బాలీవుడ్ లో సౌత్ భామల హడావుడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
By: Tupaki Desk | 5 May 2025 2:18 PM ISTబాలీవుడ్ లో సౌత్ భామల హడావుడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సమంత, రష్మిక మందన్నా, కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల కూడా బాలీవుడ్ డెబ్యూకు రెడీ అవుతోంది. అయితే వీళ్లలో ప్రూవ్ చేసుకోవాల్సిన నటీమణులు చాలా మంది ఉన్నారు. సమంత ఇప్పటికే వెబ్ సిరీస్ లతో సత్తా చాటింది. 'ది ఫ్యామిలీ మ్యాన్,' ' సీటాడెల్' లాంటి సిరీస్ లతో ఐడెంటీటీ సంపాదించింది.
కానీ వెండి తెరపై మాత్ర కనిపించలేదు. అక్కడ మెరవాలని ఆశపడుతుంది. కానీ సరైన ఛాన్స్ ఇంతవరకూ రాలేదు. సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఇప్పటికే ప్రూవ్ అయింది. 'పుష్ప' ,' యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్లతో రష్మిక సత్తా చాటింది. అటుపై 'సికిందర్' లో సల్మాన్ ఖాన్ తోనూ కలిసి నటించింది. కాబట్టి నటిగా ఆమె కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు.
బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరోలంతా ఆమెతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇక కీర్తి సురేష్ 'బేబి జాన్' తో లాంచ్ అయింది. విమర్శలతో పాటు ప్రశంసలు తొలి చిత్రంతో దక్కించుకుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా త్వరలో ఎంట్రీ ఇస్తుంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా ఓసినిమా చేస్తోంది. కిసిక్ సాంగ్ తో నార్త్ లో ఫేమస్ అయింది. కానీ అది ఐటం భామ ఐడెంటీటీ మాత్రమే.
నటిగా సత్తా చాటితే తప్ప తానేంటన్నది ఉత్తరాదిన తెలియదు. అలాగే తెలుగమ్మాయి అనన్యకు మంచి అవకాశం వచ్చింది. నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉంది. అయితే వీళ్లంతా నార్త్ లో ఫేమస్ అవ్వాలంటే ఒకటి రెండు సక్సెస్ లు సరిపోవు. వరుసగా నాలుగైదు సక్సెస్ లు బ్యాక్ టూ బ్యాక్ అందు కుంటే తప్ప ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడదు. మరి ఈ విషయంలో సౌత్ భామలు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారో చూడాలి.
