Begin typing your search above and press return to search.

సినిమాలే కాదు, సొంత బ్రాండ్లు కూడా!

సెల‌బ్రిటీలకు సంబంధించిన విష‌యాల గురించి తెలుసుకోవడానికి ఎవ‌రైనా స‌రే ఎంతో ఆతృత‌గా ఉంటారు.

By:  Tupaki Desk   |   22 July 2025 3:37 PM IST
సినిమాలే కాదు, సొంత బ్రాండ్లు కూడా!
X

సెల‌బ్రిటీలకు సంబంధించిన విష‌యాల గురించి తెలుసుకోవడానికి ఎవ‌రైనా స‌రే ఎంతో ఆతృత‌గా ఉంటారు. వారి వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి, కుటుంబ విశేషాల గురించి వ‌చ్చే వార్త‌ల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంది. సిల్వ‌ర్ స్క్రీన్ పై త‌మ అందం, అభిన‌యంతో ఎంతో అభిమానుల్ని సంపాదించుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అయితే దీపం ఉన్న‌ప్పుడే చ‌క్క‌బెట్టుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఇప్ప‌టి హీరోయిన్లు ఎంతో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే సినిమాల ద్వారా సంపాదించిన దాన్ని వివిధ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టి ఎంట్ర‌ప్రెన్యూర్లుగా దూసుకెళ్తున్నారు. కేవ‌లం సినిమాల్లో యాక్టింగ్ మాత్ర‌మే కాకుండా బిజినెస్‌లు కూడా ర‌న్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌లు బ్రాండ్ల‌ను స్టార్ట్ చేసి త‌మ బిజినెస్ ను వ్యాపింప‌చేస్తూ రీల్ లైఫ్ లోనే కాకుండా రియ‌ల్ లైఫ్ లో కూడా రాణిస్తున్నారు.

కేవ‌లం సినిమాల్లోనే కాకుండా రియ‌ల్ లైఫ్ లో కూడా స‌క్సెస్ అవ‌గ‌ల‌మ‌ని ప్రూవ్ చేసుకుంటున్న వారిలో ప‌లువురు భామ‌లున్నారు. 2020లో సాకి అనే ఫ్యాష‌న్ బ్రాండ్ ను స్టార్ట్ చేసిన స‌మంత త‌క్కువ టైమ్ లోనే అందులో స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత స‌స్టైన్‌కార్ట్ తో పాటూ ప‌లు స్టార్ట‌ప్ ల‌లో ఇన్వెస్ట్ చేశారు స‌మంత‌. సీక్రెట్ ఆల్క‌మిస్ట్ కు కో ఫౌండ‌ర్ గా ఉన్న స‌మంత, స‌మంత ఏకాం అనే ప్రీ లెర్నింగ్ స్కూల్స్ కూడా ఉన్నాయి.


టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కూడా బిజినెస్ విష‌యంలో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌నకున్న క్రేజ్ ను కేవ‌లం సినిమాల కోసం మాత్ర‌మే కాకుండా బిజినెస్ ప‌రంగానూ వాడుకుంటున్నారు. అందులో భాగంగానే యార్డ్లీ లండ‌న్ లాంటి బ్రాండ్స్ కు అంబాసిడ‌ర్ గా ఉంటూనే న్యూడ్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను కూడా మొద‌లుపెట్టి చాలా స్మార్ట్ గా దాన్ని స‌క్సెస్ చేశారు.


ఇక ర‌ష్మిక మంద‌న్నా రీసెంట్ గానే త‌న ప‌ర్‌ఫ్యూమ్ బ్రాండ్ డియ‌ర్ డైరీని నేష‌న‌ల్ క్ర‌ష్, ఇర్రీప్లేస‌బుల్ అనే పేర్ల‌తో స్టార్ట్ చేశారు. ప్ర‌తీ ఫ్రాగ్ర‌న్స్ కు సొంత ఎమోష‌న‌ల్ ఫీల్ ఉంటుందంటూ బ్యూటీ మార్కెట్ లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక కొత్త బ్రాండ్ కు సంబంధించిన ఉత్ప‌త్తుల‌ను వాడ‌టానికి ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.


లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారకు కూడా ఎన్నో వ్యాపారాలున్నాయి. రౌడీ పిక్చ‌ర్స్ అనే బ్యాన‌ర్ తో పాటూ 9 స్కిన్, ఫెమి9, ది లిప్ బామ్ కంపెనీ లాంటి స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా న‌య‌న‌తార ఫుడ్ బిజినెస్ లో కూడా పెట్టుబ‌డులు పెట్టారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బిజినెస్ విష‌యంలో సైలెంట్ గా ఉంటూనే త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు.


త‌మ‌న్నా త‌న ఫ్యామిలీ బిజినెస్ వైట్ & గోల్డ్ కు స‌పోర్ట్ చేయ‌డంతో పాటూ ప‌లు బ్యూటీ స్టార్ట‌ప్స్ లో పెట్టుబ‌డి పెట్టారు. రియ‌ల్ ఎస్టేట్ లో కూడా త‌మ‌న్నాకు షేర్లున్నాయి.