Begin typing your search above and press return to search.

యంగ్ హీరోయిన్ ప‌విట కొంగు నిల‌వ‌నంటోంది!

ప‌విట కొంగు జార‌విడిస్తే.. కుర్రాళ్లు గ‌గ్గోలే. ఇదిగో ఇక్క‌డ కాన్సెప్ట్ కొంచెం అటూ ఇటూగానే ఉంది

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:07 AM GMT
యంగ్ హీరోయిన్ ప‌విట కొంగు నిల‌వ‌నంటోంది!
X

ప‌విట కొంగు జార‌విడిస్తే.. కుర్రాళ్లు గ‌గ్గోలే. ఇదిగో ఇక్క‌డ కాన్సెప్ట్ కొంచెం అటూ ఇటూగానే ఉంది. పేరుకు త‌గ్గ‌ట్టే బాలీవుడ్ యువ‌న‌టి సౌంద‌ర్య శ‌ర్మ ప‌విట కొంగును ఎంత‌గా స‌వ‌రించాలో అంత‌గానే స‌వ‌రిస్తూ ఇదిగో ఇలా కోక ర‌వికెలో ఫోజులిచ్చిన తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. సౌంద‌ర్య ఇన్న‌ర్ సొగ‌సును ఆవిష్క‌రిస్తున్న తాజా ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. జారిపోయే ప‌విట న‌డుము అందాల‌ను దాచ‌లేదని కూడా దీనిని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

నిజానికి సౌంద‌ర్య త‌ల్లిదండ్రులు డాక్ట‌ర్లు. సౌందర్య డెంటల్ డాక్ట‌ర్ గా బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. డాక్ట‌ర్ కుమార్తె డాక్ట‌ర్ కాలేదు కానీ యాక్టర్ అయింది. సౌంద‌ర్య శ‌ర్మ షోబిజ్ ప్ర‌పంచంలో గ‌త కొన్నేళ్లుగా మెరుపులు మెరిపిస్తోంది. వెబ్ సిరీస్ నటిగా సౌంద‌ర్య శ‌ర్మ నిరూపించుకుంది. ర‌క్తంచ‌ల్ బ్యూటీ గా ఇప్ప‌టికే బోలెడంత‌ పాపుల‌ర్ అయింది. 2017 లో `రాంచీ డైరీస్`తో హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. మూడేళ్ల లో రక్తంచ‌ల్ అనే క్రైమ్ డ్రామాతో వెబ్ సిరీస్ నాయిక‌గా మెరిపించింది.

క‌థానాయిక కాక‌ముందు సౌంద‌ర్య చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ .. లీస్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో న‌టవిద్య‌ను అభ్య‌సించిన సౌంద‌ర్య రక్తంచ‌ల్ రెండో సీజ‌న్ లో అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. OTTలో మూడు వెబ్ సిరీస్ లు చేస్తోంది. అలాగే ఒక భారీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉంది. సౌంద‌ర్య‌కు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ‌ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. నేటిత‌రానికి కిక్కిచ్చే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ మ‌తులు చెడ‌గొడుతోంది. చీర‌లో సౌంద‌ర్య అంద‌చందాలు ఇప్పుడు కిక్కు పెంచుతున్నాయి.