`హౌస్ ఫుల్ -5` బ్యూటీ టాలీవుడ్ కి దిగేదెప్పుడు?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సౌందర్య శర్మ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్న బ్యూటీ. `రాంచీ డైరిస్` తో లాంచ్ అయిన బ్యూటీ అటుపై `థాంక్ గాడ్` లో నటించింది
By: Tupaki Desk | 8 Jun 2025 12:15 AM ISTబాలీవుడ్ యంగ్ బ్యూటీ సౌందర్య శర్మ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్న బ్యూటీ. `రాంచీ డైరిస్` తో లాంచ్ అయిన బ్యూటీ అటుపై `థాంక్ గాడ్` లో నటించింది. రెండు సినిమాలు పెద్దగా ఐడెంటిని తెచ్చి పెట్టలేదు. తాజాగా రిలీజ్ అయిన `హౌస్ ఫుల్ 5` తో మాత్రం బాగా ఊపేస్తుంది. అమ్మడి హాట్ పెర్పా ర్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. `లాల్ పరి` పాటతో సౌందర్య శర్మ పెర్పార్మెన్స్ కి మంచి పేరొస్తోంది.
సినిమా లో న్యాయవాదిగా సహాయక పాత్ర పోషించినా? బోల్డ్ సన్నివేశాలతో కనెక్ట్ అవ్వడంతో వైరల్ అవు తోంది. దీంతో ఈ సినిమా అమ్మడి కెరీర్ కొత్త మలుపులా మారబోతుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. బాలీవుడ్ లో సినిమా సక్సెస్ కంటే ట్యాలెంట్ చూస్తారు. ఆ ప్రతిభతో కొత్త అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. అందులో సౌందర్య శర్మ నిలబడుతుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
సౌందర్య శర్మ ట్యాలెంటెడ్ బ్యూటీ. చిన్నప్పుడే భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్‌షాప్‌లో పాల్గొంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో షార్ట్-యాక్టిం గ్ కోర్సు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏసీటీఐ థియేటర్ గ్రూప్‌లోనూ స్థానం సంపా దించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన `బిగ్ బాస్ 16`వ సీజన్ లో పాల్గొంది. అలా సల్మాన్ తోనూ పరిచయం ఏర్పడింది.
నటిగా ఫేమస్ అవుతోన్న తరుణంలో సల్మాన్ ఖాన్ పిలిచి పక్కన ఛాన్స్ ఇచ్చినా? ఇవ్వొచ్చు. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హీటెక్కించే పోటోలు వదులుతుంది. ఇన్ స్టాగ్రామ్‌లో 9.9 మిలియన్ల మంది ,ఎక్స్ లో 154.3కె ఫాలోవర్లు ఉన్నారు. అమ్మడి స్వస్థలం ఢిల్లీ. మరి ఈ బ్యూటీ టాలీవుడ్ కి ఎప్పుడు దిగుతుందో చూడాలి.
