Begin typing your search above and press return to search.

మేఘాలు చెప్పిన ప్రేమ కథ.. సంగీతంలో మెరిసిన ‘సౌండ్ ఆఫ్ లవ్’

నరేష్ అగస్త్య, రుబియా ఖాతూన్ జంటగా నటిస్తున్న ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 6:19 AM
మేఘాలు చెప్పిన ప్రేమ కథ.. సంగీతంలో మెరిసిన ‘సౌండ్ ఆఫ్ లవ్’
X

నరేష్ అగస్త్య, రుబియా ఖాతూన్ జంటగా నటిస్తున్న ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. టీజర్‌తోనే ఆకట్టుకున్న ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీగా వస్తోంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా వచ్చిన ‘సౌండ్ ఆఫ్ లవ్’ అనే పాట అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, రెహ్మాన్ రాసిన లిరిక్స్ చక్కగా కలిసిపోయాయి.


అలాగే ఎస్పీబీ చరణ్, శశాతి రూపతి పాడిన గానం చాలా ఫీల్ ఇచ్చేలా ఉంది. మ్యూజిక్ కూడా సింపుల్‌గా ఎమోషనల్ టచ్ తో ఉంది. ప్రేమలో ఉండే భావాలను ఈ పాట బాగా హైలెట్ చేస్తోంది. ఇక పాటలో నరేష్, రుబియా జంటగా కనిపించారు. వీరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా కనిపించింది. రుబియా ట్రెండీ ఎండు కలర్ డ్రెస్సులో ఉండగా, నరేష్ కూల్ లుక్‌లో కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. వీరి మధ్య ఉన్న భావోద్వేగాలు ఈ పాటకు మరింత బలాన్నిచ్చాయి.

సినిమాకి విపిన్ రచయితగా, దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఉమా దేవి కోటా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఆమని వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి అభినయం కూడా కథలో బాగా సహాయపడుతుందని అంచనా. ‘సౌండ్ ఆఫ్ లవ్’ పాట సినిమాపై అంచనాలను ఇంకా పెంచింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్టు మేకర్స్ చెప్పారు.

ప్రేమ కథల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి అనుభవాన్ని అందించబోతుందని అంటున్నారు. మొత్తంగా ఈ పాటతో సినిమాపై మంచి క్రేజ్ వచ్చింది. జస్టిన్ సంగీతం, విపిన్ దర్శకత్వం కలిపి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మార్చే అవకాశముంది. నరేష్ అగస్త్య, రుబియా ఖాతూన్ లవ్ జంటగా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఇక థియేటర్‌లో ఈ ప్రేమ ప్రయాణం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.