Begin typing your search above and press return to search.

భార్య‌ అనే పిలుపే నాకు అస‌హ్యం అన్న న‌టి!

ప్ర‌ముఖ న‌టి.. పాపుల‌ర్ గాయ‌కుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయ్యారు.

By:  Tupaki Desk   |   22 May 2024 8:27 AM GMT
భార్య‌ అనే పిలుపే నాకు అస‌హ్యం అన్న న‌టి!
X

ప్ర‌ముఖ న‌టి.. పాపుల‌ర్ గాయ‌కుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అయ్యారు. కానీ విభేధాల‌తో అనూహ్యంగా విడిపోయారు. అత‌డి నుంచి విడిపోయిన త‌ర్వాత కూడా స‌ద‌రు గాయ‌ని అత‌డిని తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. అత‌డికి భార్య‌ను అనే భావ‌న త‌న‌కు ఎప్పుడూ క‌ల‌గ‌లేద‌ని, భార్య అనే ప‌ద‌మే త‌న‌కు అస‌హ్య‌మ‌ని కూడా వ్యాఖ్యానించింది.

పాపుల‌ర్ హాలీవుడ్ న‌టి సోఫీ టర్నర్ - అమెరిక‌న్ గాయ‌కుడు జో జోనాస్ మ‌ధ్య బ్రేక‌ప్ వ్య‌వ‌హారం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. విడాకుల‌తో వారి సంబంధాన్ని ముగించారు. 7 సంవత్సరాల దాంప‌త్యంలో ఇద్దరు పిల్లల త‌ల్లిదండ్రులైన‌ తర్వాత 2023లో అనూహ్యంగా విడిపోయారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జోతో తనకున్న సంబంధం గురించి, జోనాస్ కుటుంబంలో భాగమైనందుకు తనకు అయిన అనుభ‌వాలేమిట‌న్న‌ది సోఫీ ప్ర‌స్థావించింది.

ముగ్గురు జోనాస్ బ్రదర్స్ - జో, నిక్, కెవిన్ లు వివాహం చేసుకున్నారు. సంగీత పర్యటనలలో వారితో పాటు భార్య‌లు తరచుగా కనిపించేవారు. కానీ త‌న‌కు భార్యలా ఉన్న ఫీలింగ్ ఏనాడూ క‌ల‌గ‌లేద‌ని సోఫీ ట‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. జోజోనాస్ తనకు ఎప్పుడూ అలాంటి అనుభూతిని కలిగించలేదని స్పష్టం చేసింది. ముగ్గురు సోదరుల‌కు భార్యలపై చాలా శ్రద్ధ ఉంది. మమ్మల్ని ఎప్పుడూ భార్యలు అని పిలిచేవారు.. కానీ నేను దానిని అసహ్యించుకున్నాను. ముగ్గురు ఆడ వాళ్లం ఏదో ఒకవిధంగా గ్రూపుగా ఉన్న‌ట్టు భావించాన‌ని సోఫీ చెప్పారు. ఇది ఒక రకమైన ప్లస్-వన్ భావన. కానీ నాకు అతడితో సంబంధంలో అలా లేదు .. అతడు నాకు ఎలాంటి అనుభూతిని కలిగించలేదు. కేవ‌లం బ్యాండ్‌లోని గ్రూప్‌గా మాత్ర‌మే ఉన్నాం`` అని సోఫీ బ్రిటిష్ వోగ్‌తో అన్నారు.

జో - సోఫీల మ‌ధ్య బ్రేకప్ అనంత‌రం చాలా టాబ్లాయిడ్‌లలో పార్టీల‌ను అమితంగా ఇష్టపడే బాధ్యతారహితమైన తల్లి అని సోఫీపై కామెంట్ చేస్తూ రాసాయి. ఆ దశను తన జీవితంలో అత్యంత చెత్త సమయం అని పేర్కొన్నారు సోఫీ. ప్రత్యేకంగా నా పిల్లల విషయానికి వస్తే... ప్రతిదానిలోను నేను అసంతృప్తిగా ఉన్నాను. వీటన్నింటిలో వారే బాధితులు. కానీ మేము చేయగలిగినంత ఉత్తమంగా చేస్తున్నామని నేను భావిస్తున్నాను. మా పిల్లలకు గొప్ప తండ్రి జో అని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.

స‌హ‌న‌టి స‌హాయానికి థాంక్స్:

గత సెప్టెంబరులో న్యూయార్క్‌లో ఉండటానికి చోటు లేని స్థితిలో త‌న‌కు సహాయం చేసినందుకు టేలర్ స్విఫ్ట్ కి సోఫీ కృతజ్ఞతలు తెలిపారు. స్విఫ్ట్ ఆమెను తన నివాసంలో ఉండమని ఆహ్వానించింది. నా పిల్లలను నన్ను తీసుకువెళ్లి, మాకు ఇల్లు సురక్షితమైన చోటును అందించినందున నేను ఆమె (టేల‌ర్ )పై ఎప్ప‌టికీ కృత‌జ్ఞ‌తాభావంతో ఉన్నాను. నిజంగా త‌న‌ది బంగారు హృద‌యం`` అని సోఫీ టర్నర్ అన్నారు. జోనాస్ నుంచి విడిపోయే క్ర‌మంలో సొంత ఇల్లు లేని సోఫీకి టేల‌ర్ స్విఫ్ట్ స‌హాయం అందించారు.