వీడియో: డ్రైవర్ లేని కార్‌లో నటి సాహసం
నటి కం వీజే సోఫీ చౌదరి పరిచయం అవసరం లేదు. ఈ భామ మహేష్ `1-నేనొక్కడినే` చిత్రంలో `లండన్ బాబులు` అనే ఐటమ్ పాటలో నటించింది.
By: Tupaki Desk | 20 April 2025 7:30 PMనటి కం వీజే సోఫీ చౌదరి పరిచయం అవసరం లేదు. ఈ భామ మహేష్ `1-నేనొక్కడినే` చిత్రంలో `లండన్ బాబులు` అనే ఐటమ్ పాటలో నటించింది.
. సోఫీ నిరంతర ప్రయాణాలు, యోగా ఫీట్లు, యాడ్ షూట్లతో ఎప్పుడూ బిజీగా గడిపేస్తుంది. తన యాక్టివిటీస్ ని రెగ్యులర్ గా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.
ఇప్పుడు ఈ భామ డ్రైవర్ లేని కార్ లో ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో ఇతర వాహనాలతో పాటు డ్రైవర్ లేని కార్ రోడ్ పై వెళుతుంటే గుబులు రేపుతోంది. ప్రయాణం సరిగా సాగుతుందా లేదా? అనే సందేహంతో కనిపించింది సోఫీ. నమ్మకం అనేది ఇక్కడ పెద్ద మ్యాటర్! అసలు డ్రైవర్ తో పని లేకుండా ఇలాంటి జర్నీ చేయడం సాహసమే కదా! అని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. అయితే టెస్లా కంపెనీ కార్స్ హై ఎండ్ టెక్నాలజీతో దీనిని సుసాధ్యం చేసాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగినా కానీ, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన ప్రయోగాలను ఆపడం లేదు.
డ్రైవర్ లేని కార్ లో అందాల భామ ప్రయాణం కొంత గుబులు రేపినా కానీ ఆమె ధైర్యంగానే ప్రయాణిస్తోంది.. కానీ ఇది భయానకంగా ఉంది! అని నెటిజనులు అభిప్రాయపడ్డారు. ఏ మార్గం గుండా వెళ్లాలో ముందే ఇన్ స్టాల్ చేసిన మ్యాప్ ని అనుసరించి కార్ దానంతట అదే వెళుతుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ.
ఇటీవల హృతిక్ రోషన్ అమెరికా పర్యటనకు ఆతిథ్యం ఇచ్చినందుకు సోఫీ వార్తల్లో నిలిచింది. అమెరికాలో హృతిక్ తన ఫ్యాన్స్ అందరినీ కలిసేందుకు సోఫీ చాలా సహకారం అందించినందుకు హృతిక్ ధన్యవాదాలు తెలిపాడు.
సోఫీ చౌదరి ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్గర్ సహా పలు చిత్రాల్లో నటించింది. తను ఒక అద్భుతమైన గాయని. దాదాపు పాతికేళ్ల క్రితం ఏక్ పర్దేసి, హబీబి, లే లే మేరా దిల్ లాంటి పాపులర్ సింగిల్స్ లో కనిపించింది.