జీవిత పాఠాలన్నీ అప్పుడే నేర్చుకున్నా
ఇండస్ట్రీలోకి వచ్చాకి అక్కడే కంటిన్యూ అవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా వచ్చిన వారిలో తమిళ నటుడు సూరి కూడా ఒకరు.
By: Tupaki Desk | 14 May 2025 1:30 PMసినీ ఇండస్ట్రీలో రోజుకు ఎంతోమంది వస్తుంటారు. అయితే వారందరూ నిలదొక్కుకోవాలనేమీ లేదు. అయితే వారిలో కొందరు వారసత్వ పరంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే మరికొందరు మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి మరీ చిత్ర పరిశ్రమలోకి వస్తుంటారు. ఎంత కష్టమైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చాం కదా అని ఊరుకోవడానికి లేదు.
ఇండస్ట్రీలోకి వచ్చాకి అక్కడే కంటిన్యూ అవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా వచ్చిన వారిలో తమిళ నటుడు సూరి కూడా ఒకరు. 1998లో కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన సూరి ఆరేళ్ల పాటూ అసలు గుర్తింపు రాని పాత్రల్లోనే నటించాడు. 2004 నుంచి అతనికి అప్పుడప్పుడు కొన్ని మంచి పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు సూరి.
2022 వరకు సూరి కమెడియన్ గానే పలు సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కోలీవుడ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూరి, అదే టైమ్ లో హీరోగా మారాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదల పార్ట్1 సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు సూరి. ఆ సినిమా తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్2, బడవ సినిమాలతో సూరి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు సూరి నుంచి త్వరలోనే మామన్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూరి తన మొదటి పని జీతం, ఆ టైమ్ లో నేర్చుకున్న పాఠాల్ని వెల్లడించాడు. తాను సినిమాల్లోకి రాకముందు రోజు కూలీగా రూ.20 జీతానికి పని చేశానని చెప్పిన సూరి, వారం మొత్తం మీద పని చేస్తే రూ.140 వచ్చేదని, అందులో సగం ఖర్చు పెట్టి, మిగిలింది ఇంటికి పంపేవాడట సూరి. జీవితంలో అన్ని పాఠాలను తాను ఆ టైమ్ లోనే నేర్చుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.