కమెడియన్ రోజు కూలీ ఇరవై రూపాయలట!
సినిమాల్లోకి ప్రవేశించాలని గట్టిగా అనుకున్న వాళ్లు ప్రారంభంలో కష్టాలు ఎదుర్కోవడం, ఆ తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 11:30 AMసినిమాల్లోకి ప్రవేశించాలని గట్టిగా అనుకున్న వాళ్లు ప్రారంభంలో కష్టాలు ఎదుర్కోవడం, ఆ తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం తెలిసిందే. తమిళ కమెడియన్ సూరి కూడా సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారట. సినిమాల్లోకి ప్రవేశించిన సమయంలోనే ఆయనని కష్టాలు వెంటాడాయట. సూరి నటించిన తాజా చిత్రం `మామన్`. ఇందులో సూరి హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్ పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మే 16న విడుదల చేశారు.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సూర్య తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వివరించారు. కెరీర్ ప్రారంభానికి ముందు సూరి తన ఫ్రెండ్స్‌తో కలిసి 1993లో తిరుప్పూర్‌లో వర్క్ చేశాడట. వారానికి సూరికి కేవలం రూ.140 రూపాయలు మాత్రమే వచ్చేవట. అందులో రూ.70 రూపాలు తన ఖర్చుల కోసం ఉంచుకుని మితగా రూ.70 రూపాయలు ఇంటి ఖర్చుల కోసం పంపించేవాడట.
ఇక దగ్గర్లో ఓ బేకరి ఉండేదని, అందులో టీ, కొబ్బరి బన్‌లు తినడానికి వెళ్లేవాడినని, అయితే వాటి మొత్తం తన బడ్జెట్‌కు మించి ఉండటంతో కేవలం టీ మాత్రమే తీసుకుని సరిపెట్టుకునే వాడినని చెప్పుకొచ్చాడు. అయితే సూరి పరిస్థితిని గమనించిన బేకరీ యజమాని కొబ్బరి బన్‌ని ఇచ్చేవాడట. తిరుప్పూర్లో తాను కెరీర్‌కి ముందు కఠినమైన జీవిత పాఠాలను నేర్చుకున్నానని, ఇప్పుడు తనకు లభిస్తున్న ఆదరణ, ప్రేక్షకుల అప్లాజ్ నేను జీవితంలో పొందిన అతిపెద్ద బహుమతిగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో, కోలీవుడ్‌లోనూ వైరల్‌గా మారింది. సూరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. స్టార్ హీరోలకు ఫ్రెండ్‌గా, సపోర్టివ్ క్యారెక్టర్‌లలో నటించి ప్రేక్షకుల్ని తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్‌ని గుర్తించిన దర్శకుడు వెట్రిమారన్ `విడుదలై` సిరీస్‌తో హీరోగా పరిచయం చేశాడు. `విడుదలై -1, విడుదలై -2 కూడా మంచి విజయాన్ని సాధించడంతో సూరికి ఇప్పుడుహీరో వేశాలే వస్తున్నాయి.
విడుదలై తరువాత సూరి గరుడన్, కట్టుకాలి చిత్రాల్లో నటించాడు. తాజాగా `మామన్` చేశాడు. ఇది ఈ 16న విడుదలైంది. దీనితో పాటు సూరి హీరోగా మరో రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో `మందాడి` ఒకటి. ఇందులో తెలుగు హీరో సుహాస్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.