ఫోటో స్టోరి: సోనమ్ కపూర్ ఇన్నర్ సొగసు
పైన చెప్పుకున్న వాళ్లందరికీ ఆమె అక్క! అనీల్ కపూర్ గారాల పట్టీ అయిన సోనమ్ తొలి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను నిరూపించుకున్న మేటి ప్రతిభావని.
By: Tupaki Desk | 14 Feb 2024 8:30 PM ISTఈరోజుల్లో జాన్వీ కపూర్.. ఖుషీ కపూర్.. సనయ కపూర్ అంటూ కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసురాళ్ల ఫ్యాషన్ అండ్ స్టైల్ స్టేట్‌మెంట్ గురించి ఎక్కువగా ముచ్చటించుకుంటున్నాం కానీ, వీళ్లందరి కంటే ముందే ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలిగిన కపూర్ గాళ్ ఎవరు? అంటే సోనమ్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పైన చెప్పుకున్న వాళ్లందరికీ ఆమె అక్క! అనీల్ కపూర్ గారాల పట్టీ అయిన సోనమ్ తొలి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను నిరూపించుకున్న మేటి ప్రతిభావని.
సోనమ్ కపూర్ బాలీవుడ్ అరంగేట్రం నుండి ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది. ఇటీవల పూర్తిగా నటనకు దూరమైంది. పెద్ద స్క్రీన్ నుండి నిష్క్రమించినప్పటికీ ఇండస్ట్రీలో పాన్ వరల్డ్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్లలో సోనమ్ సందడి చేస్తోంది. సోనమ్ అద్భుతమైన దుస్తుల ఎంపిక ఫ్యాషన్ సెన్స్ కారణంగా తనను ఆరాధించే అభిమానులు భారీగా పెరిగారు.
ప్రపంచంలోని ప్రధాన ఈవెంట్‌లలో రెడ్ కార్పెట్ ఈవెంట్లలో సోనమ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్యారిస్.. లండన్.. యూరోప్ దేశాల్లో సోనమ్ భారీ ఈవెంట్లలో పాల్గొని ఫ్యాషనిస్టాగా నిరూపించింది. కేన్స్ వంటి చోట్ల సోనమ్ ఫ్యాషన్ సెన్స్ గురించి బోలెడంత చర్చ సాగింది. ఇంట్లో పండుగ డ్రెస్సింగ్ అయినా.. ఈవెంట్లో స్పెషల్ డ్రెస్ అయినా.. తన అద్భుతమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ప్రతిసారీ సోనమ్ విస్మయపరుస్తుంది.
ఇప్పుడు అహుజా ఆభరణాల ఈవెంట్‌లో సోనమ్ కపూర్ మెరుపులు మెరిపించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అద్భుతమైన నల్లటి ట్యూబ్ టాప్ .. ఫ్లూయింగ్ స్కర్ట్ ధరించిన సోనమ్ కపూర్ జ్యువెలరీ ఈవెంట్‌లో చక్కటి సొగసుతో మెరిసిపోయింది. ప్లీటెడ్ స్కర్ట్ తన అందాన్ని పదింతలు పెంచింది. నటి కం స్టైల్ ఐకాన్ అయిన సోనమ్ కపూర్ తన డిజైనర్ లుక్ తో ఆర్టిసన్స్ జ్యువెలరీ డిజైన్ అవార్డ్స్‌లో షో స్టాపర్ గా నిలిచింది. ఈ లుక్ లో సోనమ్ అద్భుతమైన ఆభరణాలు అందరి దృష్టిని దోచుకున్నాయి. మెరిసే డైమండ్ చోకర్ .. దానికి సరిగ్గా సరితూగే చెవిపోగులతో సోనమ్ చక్కగా కనిపించింది. ప్రతి ఆభరణం సోనమ్‌కి ఉన్న అత్యద్భుతమైన అభిరుచిని ఎలివేట్ చేస్తున్నాయి. ఆభరణ ఉపకరణాలపైనా సోనమ్ మక్కువను ఈ షో ప్రదర్శించింది. చిక్ బ్లాక్ స్వెడ్ బూట్‌లను ధరించి ఆధునికతను తెచ్చింది. సోనమ్ తదుపరి వీరే ది వెడ్డింగ్ సీక్వెల్ లో కనిపించే అవకాశం ఉంది.
