Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్‌.. కారణం ఇదే!

ఆమె అరెస్ట్‌ కి గల కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు నెట్టింట ఆమె పేరు తో జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   22 March 2024 11:19 AM GMT
బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్‌.. కారణం ఇదే!
X

కన్నడ బిగ్ బాస్ లో కనిపించి పాపులారిటీని సొంతం చేసుకున్న నటి సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె అరెస్ట్‌ కి గల కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు నెట్టింట ఆమె పేరు తో జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇటీవల సోను శ్రీనివాస గౌడ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేసింది. అందులో తాను ఒక బాలికను దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించింది. దత్తత తీసుకున్న బాలికకు అన్ని తానై చూసుకుంటాను, తన చదువుతో పాటు అన్ని విషయాలకు తాను భరోసా అన్నట్లుగా పోస్ట్‌ చేసింది.

సోను దత్తత వీడియో వైరల్‌ అవ్వడంతో చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు స్పందించారు. ఆమె దత్తత చట్టరీత్యా నేరం అన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె సమాజంలో పేరు కోసం, పబ్లిసిటీ కోసం దత్తత తీసుకుందని, ఆమె సరైన పద్ధతిలో దత్తత తీసుకోలేదు అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్రమ దత్తత తీసుకుని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను సోను శ్రీనివాస గౌడ పై కేసు నమోదు చేసినట్లు బైదరహళ్లి పోలీసులు పేర్కొన్నారు. మంచి చేసేందుకు బాలికను దత్తత తీసుకున్న సోను ను ఇలా అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దత్తత చట్ట విరుద్దం అయితే చట్టబద్దంగా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి కదా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.