Begin typing your search above and press return to search.

బిల్లు కట్టి రియల్‌ హీరోకి షాక్ ఇచ్చిన ఫ్యాన్‌..!

ఒక ప్రముఖ రెస్టారెంట్‌ లో తాము భోజనం చేస్తున్న సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి తమ బిల్లును చెల్లించి ఒక నోట్‌ ను మాకు అందించారు. అతను నన్ను కలవకుండానే వెళ్లి పోయారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 9:08 AM GMT
బిల్లు కట్టి రియల్‌ హీరోకి షాక్ ఇచ్చిన ఫ్యాన్‌..!
X

కోవిడ్ సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో కొద్ది మంది జనాల కోసం ముందడుగు వేశారు. అందులో సోనూ సూద్‌ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. లాక్ డౌన్‌ టైమ్‌ లో సోనూ సూద్‌ వలస కూలీల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం మొదలుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

ఇండియాలో కరోనా నాటి సంగతులు చర్చిస్తే అందులో కచ్చితంగా సోనూ సూద్‌ ప్రస్థావన ఉంటుంది. అలాంటి సోనూ సూద్‌ ను ఇప్పటికి కూడా రియల్‌ హీరో అంటూ అంతా కూడా కీర్తిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అందరూ ఆయన్ను అభిమానిస్తూనే ఉంటారు. సోనూసూద్‌ రెగ్యులర్‌ గా తన సంస్థ ద్వారా చారిటీ నిర్వహిస్తూ ఉంటాడు.

తాజాగా తనకు ఒక అభిమాని నుంచి ఎదురైన ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఒక ప్రముఖ రెస్టారెంట్‌ లో తాము భోజనం చేస్తున్న సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి తమ బిల్లును చెల్లించి ఒక నోట్‌ ను మాకు అందించారు. అతను నన్ను కలవకుండానే వెళ్లి పోయారు.

ఆ నోట్‌ లో దేశం కోసం మీరు చేస్తున్న అన్ని మంచి పనులకు కృతజ్ఞతలు అని పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు ఆ అభిమాని ఎవరు అనేది తెలియదు అన్నట్లుగా సోనూసూద్‌ చెప్పుకొచ్చాడు. ఇలాంటివి కరోనా తర్వాత సోనూ సూద్ ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు.

ఇక సోనూ సూద్ సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య వరుసగా హీరోగా సినిమాలను చేశాడు. కానీ వాటిల్లో ఎక్కువ శాతం నిరాశ పరిచాయి. దాంతో ఆయన మళ్లీ విలన్‌ వేశాలు వేస్తూ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో సోనూ సూద్‌ ఫాలోయింగ్‌ కూడా భారీ ఎత్తున పెరిగింది.