Begin typing your search above and press return to search.

FIR రద్దు చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించిన గాయ‌కుడు

ఈ కేసును జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారించి ఆ తేదీకి త‌దుప‌రి విచార‌ణ‌ను షెడ్యూల్ చేసింది.

By:  Tupaki Desk   |   13 May 2025 10:32 PM IST
FIR రద్దు చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించిన గాయ‌కుడు
X

కర్నాట‌క వ‌ర్సెస్ సోను నిగ‌మ్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఒక లైవ్ ఈవెంట్లో అభిమానిని ప‌హ‌ల్గామ్ తీవ్ర‌వాదితో పోల్చిన సోను నిగ‌మ్‌పై క‌న్న‌డిగులు పూర్తిగా గుర్రుగా ఉన్నారు. గొడ‌వ కోర్టు గ‌డ‌ప వ‌ర‌కూ చేరుకుంది. ఎట్ట‌కేల‌కు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ గాయకుడు సోను నిగ‌మ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ కోసం మే 15న కర్ణాటక హైకోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసును జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారించి ఆ తేదీకి త‌దుప‌రి విచార‌ణ‌ను షెడ్యూల్ చేసింది.

కన్నడిగులను హింసాత్మ‌క ప్ర‌వృత్తి ఉన్న‌ ఉగ్రవాదులుగా సోను సూద్ చిత్రీకరించాడ‌ని ఆరోపిస్తూ క‌న్న‌డ ర‌క్ష‌ణ వేదిక కోర్టులో పిటిష‌న్ వేసింది. కన్నడిగులను అవమానించేలా సోను నిగ‌మ్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని, వాటికి ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తూ కోర్టులో తగిన కౌంటర్‌ను సమర్పించనున్నట్లు కూడా వారు తెలిపారు.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 351, 352 & 353 కింద నిగమ్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీటిలో నేరపూరిత బెదిరింపు, శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రకటనలు చేయడం వంటి సెక్ష‌న్ల‌తో కేసును బిగించారు.

అయితే త‌న‌పై ఫిర్యాదుతో పాటు, ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టివేయాలని కోరుతూ సోను సూద్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఈ కేసుల నేప‌థ్యంలో సోను నిగ‌మ్ కు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ స‌హాయ‌నిరాక‌ర‌ణ‌ను అమ‌లు చేస్తోంది. సోను గ‌తంలో ప‌లు హిట్ పాట‌ల‌ను క‌న్న‌డ ప‌రిశ్ర‌మ కోసం పాడారు. తాను అన్ని భాష‌ల‌ను గౌర‌విస్తాన‌ని, అభిమాని తండ్రి వ‌య‌సు ఉన్న త‌న‌ను తీవ్రంగా అవ‌మానించ‌డం వ‌ల్ల కోప‌గించుకున్నాన‌ని తెలిపారు.