Begin typing your search above and press return to search.

ఊస‌ర‌వెల్లితో ఆట‌లాడుతోంది!

ఒక ఫోటోలో ఊస‌ర‌వెల్లిని త‌న చేతిపై ఉంచుకుని ఎలాంటి భ‌యం లేకుండా న‌వ్వులు చిందిస్తూ క‌నిపించింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:16 AM GMT
ఊస‌ర‌వెల్లితో ఆట‌లాడుతోంది!
X

2015లో జాదుగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది సోనారిక బ‌దోరియా. ఆరంగేట్రం నాగశౌర్య స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ 'స్పీడున్నోడు'లోనూ న‌టించింది. 'ఈడోరకం ఆడోరకం'లో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. కానీ సోనారిక బ్యాడ్ లక్ .. ఇవేవీ హిట్లు కాలేదు. దాంతో తెలుగు ప‌రిశ్రమ నుంచి దూర‌మైంది.


ఇత‌ర భామ‌ల్లానే ఈ బ్యూటీ కూడా అటు హిందీ ప‌రిశ్ర‌మ‌, ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ రెండు చోట్లా న‌టిస్తూ కెరీర్ ప‌రంగా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్కుంది. అయితే ఈ గేమ్ లో విజ‌యం వ‌రించ‌క‌పోవ‌డంతో తిరిగి టీవీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. ఇటీవ‌ల టీవీ సీరియల్స్ తో బిజీ అయ్యింది. సోనారిక నిజానికి టీవీ మూవీ న‌టి. రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోను త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది. హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటించి మెప్పించింది.


ప్ర‌స్తుతం మ‌రోసారి పెద్ద తెర రీలాంచ్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. అవకాశాల కోసం గ్లామర్ షోలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. సోనారిక నిరంత‌ర ఇన్ స్టా ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా

సోనారిక ఇటీవ‌లే బ‌ర్త్ డే పార్టీ నుంచి అంద‌మైన ఫోటోలు వీడియోల‌ను షేర్ చేసింది. వీటిలో ఈ భామ ఎంతో అందంగా క‌నిపించింది. ఒక ఫోటోలో ఊస‌ర‌వెల్లిని త‌న చేతిపై ఉంచుకుని ఎలాంటి భ‌యం లేకుండా న‌వ్వులు చిందిస్తూ క‌నిపించింది. ప్ర‌స్తుతం సోనారిక స్ట‌న్నింగ్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. సోనారిక ప్ర‌య‌త్నాలు చూసాక అయినా తిరిగి టాలీవుడ్ పిలుస్తుందేమో చూడాలి. న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలుగులో ప‌లు వెబ్ సిరీస్ లు తెర‌కెక్కిస్తున్నారు. టీవీ మూవీ న‌టి సోనారిక మునుముందు వెబ్ సిరీస్ ల‌లోను న‌టిస్తుందేమో చూడాలి.