Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టీవీ మూవీ న‌టి వేడెక్కిస్తోందిలా

15లో జాదుగాడు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది సోనారిక బ‌దోరియా. నాగశౌర్య స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ తొలి సినిమా నుంచే తన గ్లామర్ షోకి వెన‌కాడ‌లేదు.

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:15 AM GMT
ఫోటో స్టోరి: టీవీ మూవీ న‌టి వేడెక్కిస్తోందిలా
X

2015లో జాదుగాడు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది సోనారిక బ‌దోరియా. నాగశౌర్య స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ తొలి సినిమా నుంచే తన గ్లామర్ షోకి వెన‌కాడ‌లేదు. బెల్లంకొండ‌ 'స్పీడున్నోడు'లోనూ సోనారికా గ్లామ‌ర‌స్ పాత్ర‌లో అల‌రించింది. 'ఈడోరకం ఆడోరకం'లోనూ న‌టించింది. కానీ త‌న‌కు ఇక్క‌డ స‌రిగా ల‌క్ క‌లిసి రాలేదు. వ‌రుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఆ త‌ర్వాత‌ బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో న‌టించింది. ఇంద్రజిత్ అనే త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. కానీ ఏ రంగంలోను ఆశించిన మైలేజ్ ద‌క్క‌లేదు. దీంతో తిరిగి టీవీ సీరియ‌ళ్ల‌తో బిజీ అయింది. హిందీలో హరహర మహదేవ్ సీరియల్ తో సోనారిక గొప్ప పేరు తెచ్చుకుంది. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన సోనారిక హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారుతోంది.


ఇదివ‌ర‌కూ కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న తర్వాత ప్రస్తుతం సినిమాలు, OTT ల‌పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను అందాల పోటీలో గెలవాలని లేదా నటిని కావాలని మా అమ్మ కోరుకునేది. నేను గత 11 సంవత్సరాల నుండి పరిశ్రమలో ఉన్నాను. ఈ ప్ర‌యాణం సాఫీగా సాగింది. కానీ ఎక్కడో ఒకచోట నేను బాగా చేయగలననే భావన ఉంది. న‌టిగా అర్హురాలిని అని భావించే వారు చాలా మంది ఉన్నారు! నా వైపు నుండి నేను టీవీ నుండి తమిళం, తెలుగు మరియు హిందీ సినిమాల వరకు అన్ని మార్గాలను ప్రయత్నించాను. ఇప్పుడు నేను వెబ్ సిరీస్ లు, సినిమాల‌ జోన్‌లోకి ప్రవేశించడానికి టీవీ నుండి కావాల‌నే విరామం తీసుకున్నాను. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూద్దాం.. అని చాలా సంగతులే మాట్లాడింది.

భడోరియా చాలా సంద‌ర్భాల్లో తాను టీవీకి చాలా రుణపడి ఉన్నానని అంగీకరించింది. ఈ రంగం నాకు చాలా ఇచ్చింది. కానీ నటులుగా మనం మనల్ని తిరిగి ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి నేను ఇతర ఫార్మాట్లలోకి ప్రవేశించాలనుకుంటున్నాను అని అంది. స్లైస్-ఆఫ్-లైఫ్ OTT సిరీస్ 'నో కిడ్డింగ్' లో న‌టించిన సోనారిక‌ కరణ్ (రజ్దాన్) సర్ చిత్రం హిందుత్వ చిత్రంలోను న‌టించింది.

స్వ‌స్థ‌లం ఎక్క‌డ‌?

లక్నో నా కు ఇష్ట‌మైన ప్ర‌దేశం .. నేను ఎప్పుడూ నా సెలవులను అక్కడే గడిపాను. మా తాతయ్య మరణించిన తర్వాత మా అమ్మమ్మ శీతాకాలంలో ముంబైలో మాతో నివసిస్తుంది. ఆమె వేసవికాలం లక్నోలో గడుపుతుంది. నగరంలో చుట్టుపక్కల మా అమ్మానాన్నలంతా ఉన్నారు. నా డిటాక్స్ జోన్ అయిన దుధ్వా నేషనల్ పార్క్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరంలో మా పూర్వీకుల గ్రామం ఉంది. అక్క‌డికి నా చివరి సందర్శన ఏప్రిల్-మేలో జరిగింది. ఇంత‌కుముందు త‌న ప్రియుడితో నిశ్చితార్థం కూడా అయింద‌ని సోనారిక వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. బిజ‌నెస్ మేన్ వికాష్ ప‌ర‌షార్ తో నిశ్చితార్థ‌మైంది. ఈ జంట ఫోటోలు కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అయితే పెళ్లి గురించిన ఎలాంటి అప్ డేట్ లేదు.