Begin typing your search above and press return to search.

రానా సారీకి సోనమ్ పాప కన్విన్స్ అవ్వలేదా?

రానా క్షమాపణలు చెప్పిన వెంటనే ఆమె ఇన్​స్టా స్టోరీస్​ ఓ పోస్ట్ కనిపించింది. అందులో ఓ కొటేషన్ ఉంది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 11:17 AM GMT
రానా సారీకి సోనమ్ పాప కన్విన్స్ అవ్వలేదా?
X

టాలీవుడ్ నటుడు రానా చేసిన హీరోయిన్ సోనమ్​ కపూర్​కు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సోషల్​మీడియాలో సోనమ్​పై విపరీతమైన నెగటివిటీ పెరిగిందని, అందుకు తాను చించిస్తున్నట్లు చెప్పి సారీ చెబుతూ ఓ సుదీర్ఘ పోస్ట్​ చేశారు. అది నెట్టింట్లో మస్త్ వైరల్ అయింది.

కానీ ఇప్పుడా క్షమాపణలకు సోనమ్​ కపూర్ కన్విస్​ అయినట్లు కనిపించట్లేదు. ఆమె తిరిగి నటుడు రానాకు ఓ స్మాల్​ కౌంటర్ వేసినట్లు అర్థమవుతోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం సోనమ్​ పెట్టిన ఓ పోస్టే ఇందుకు కారణం. రానా క్షమాపణలు చెప్పిన వెంటనే ఆమె ఇన్​స్టా స్టోరీస్​ ఓ పోస్ట్ కనిపించింది. అందులో ఓ కొటేషన్ ఉంది.

యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్‌వెల్ట్ రాసిన కోటేషన్​ను ఆమె పోస్ట్ చేసింది. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇతర వ్యక్తుల గరించే మాట్లాడే వారి గురించి. సంకుచితమైన మైండ్‌సెట్ ఉన్నవారు వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. గొప్ప మేధావులు (గ్రేట్ మైండ్స్​ గొప్ప మేధావులు) ఉన్నవారు ఐడీయాస్​ గురించి చర్చిస్తారు' అంటూ ఆ కోటేషన్‌లో కనపడింది.

అయితే ఈ కోటేషన్​ సోనమ్​ కపూర్​ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించే పెట్టింటదే మాటలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రానా క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ కనపడటంతో ఈ పోస్ట్​ వైరల్‌గా మారింది. అందుకే అందరూ రానాను ఉద్దేసించే సోనమ్​ ఈ పోస్ట్​ చేసిందని అంతా అనుకుంటున్నారు.

కాగా, రానా.. అంతకుముందు ఓ ఈవెంట్​లో మాట్లాడుతూ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్​ను పొగిడారు. అదే సమయంలో దుల్కర్ నటించే ఓ హిందీ సినిమాలో హీరోయిన్​కు అస్సలు క్రమశిక్షణ లేదంటూ పరోక్షంగా కామెంట్స్​ చేశారు. ఇవి వైరల్​గా మారాయి. ఆ హీరోయిన్ సోనమ్​ అంటూ నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది. ఆ తర్వాత ఇది చూసి రానా సోనమ్​కు సారీ చెప్పారు. అనంతరం సోనమ్​ తాజా పోస్ట్ చేశారు.