Begin typing your search above and press return to search.

టాలీవుడ్ టు బాలీవుడ్ అప్పట్లో టాప్ హీరోయిన్.. ఆఫ్టర్ గ్యాప్ ఎంట్రీకి రెడీ..!

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సోనం ఖాన్ మ్యారేజ్ లైఫ్ లో గొడవల వల్ల 2016లో డైవర్స్ తీసుకుంది. 30 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న సోనం ఖాన్ 51 ఏళ్ల వయసులో రీ ఎంట్రీకి రెడీ అయ్యింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:30 AM GMT
టాలీవుడ్ టు బాలీవుడ్ అప్పట్లో టాప్ హీరోయిన్.. ఆఫ్టర్ గ్యాప్ ఎంట్రీకి రెడీ..!
X

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనం ఖాన్ బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు చేసింది. 90వ దశకంలో హిందీ పరిశ్రమలో సోనం ఖాన్ వరుస సినిమాలతో సందడి చేసింది. బాలీవుడ్ లో పాపులర్ అయిన సోనం ఖాన్ తెలుగు సినిమా సామ్రాట్ సినిమాతో తెరంగేట్రం చేసింది. సూపర్ స్టార్ కృష్ణ తో ముగ్గురు కొడుకులు సినిమాలో కూడా నటించిన ఆమె మోహన్ బాబు చిరంజీవి కాంబోలో వచ్చిన కొదమసింహం సినిమాలో కూడా నటించింది.


తెలుగు హిందీ భాషల్లో దాదాపు 35 సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజీవ్ రాయ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సోనం ఖాన్ మ్యారేజ్ లైఫ్ లో గొడవల వల్ల 2016లో డైవర్స్ తీసుకుంది. 30 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న సోనం ఖాన్ 51 ఏళ్ల వయసులో రీ ఎంట్రీకి రెడీ అయ్యింది.

1994 తర్వాత సినిమాలకు దూరమైన సోనం ఖాన్ దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించేందుకు రెడీ అవుతుంది. మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయిన సోనం ఖాన్ రీసెంట్ గా త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తున్నా.. చాలా ఆఫర్స్ ఉన్నాయి.. వాటి గురించి ఆలోచిస్తున్నా.. అయితే తానెవ్వరు అన్నది 40 కంటే తక్కువ వయసున్న వారికి తెలియకపోవచ్చు. నన్ను గుర్తు పట్టకపోయినా బాధపడను. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నాను.. ఇప్పుడు మళ్లీ ఇక్కడికే వచ్చాను ఇక మెదట ఇక్కడే కొనసాగుతా అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఓటీటీలో హీరో హీరోయిన్లు ఉండరు. కథ అందులోని పాత్రలే బలంగా ఉంటాయి. సినిమానా ఓటీటీనా అని అడిగితే తాను ఓటీటీకే ఓటేస్తానని అంటుంది సోనం ఖాన్. వెబ్ సీరీస్ లో నటించాలని ఉందని అలాంటి ఛాన్స్ వస్తే చేస్తానంటుంది అమ్మడు. తన ఆప్షన్ పట్ల క్లారిటీతోనే ఇలా చెబుతున్నా ఇది ఈగో అనుకోకండని ఆమె అన్నది. మరి సోనం ఖాన్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకప్పుడు నటీనటులకు సినిమాల్లోనే అవకాశాలు ఉండేవి కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ వచ్చిన తర్వాత ఒకప్పటి తారలకు మంచి అవకాశం దక్కింది. రీ ఎంట్రీ తో ఇదివరకు క్రేజ్ తో పాటుగా కొత్త కొత్త సీరీస్ లతో వారు మెప్పిస్తున్నారు.