పిక్‌టాక్ : వింటేజ్ లుక్‌లో వింబుల్డన్‌కి ముద్దుగుమ్మ
ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా కనిపించడం మాత్రమే కాకుండా ట్రెండ్‌ను ఫాలో కాకుండా విభిన్నంగా కనిపించడం ముఖ్యం.
By: Tupaki Desk | 17 July 2025 2:00 AM ISTప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న వింబుల్డన్ కి వందలాది మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఇండియన్ సెలబ్రిటీలు సైతం ఎంతో మంది లండన్‌లో జరిగిన వింబుల్డన్‌కి హాజరు అయ్యారు. వారంతా సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వింబుల్డన్‌కు హాజరు అయిన వారు ఎక్కువ మంది పెద్ద అవార్డ్ వేడుకకు హాజరు అయినట్లుగా, రెడ్ కార్పెట్ పై నడిచేందుకు వెళ్లినట్లుగా తయారు అయ్యి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. అందరి తరహాలోనే సోనమ్ కపూర్ సైతం చాలా అందంగా, విభిన్నమైన ఔట్ ఫిట్‌లో వింబుల్డన్‌కు హాజరు అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా అక్కడున్న వారంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా కనిపించడం మాత్రమే కాకుండా ట్రెండ్‌ను ఫాలో కాకుండా విభిన్నంగా కనిపించడం ముఖ్యం. సోనమ్ కపూర్ వింబుల్డన్ కోసం చాలా ప్రత్యేకంగా రెడీ అయింది. ఆమె వింటేజ్ లుక్‌లో నిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. వింబుల్డన్ థీమ్‌తో తన డ్రస్‌ను డిజైన్ చేయించుకుంది. టెన్నిస్ రాకెట్‌ను తన బ్లేజర్ పై ధరించడంతో పాటు, చెర్నీ ఆకారంలో ఉన్న విభిన్నమైన బ్రూచీను, అంతే కాకుండా తన చేతి వేళ్ల మీద కూడా టెన్నీస్ బంతుల ఆకారంను పోలి ఉన్న రింగ్స్‌ను ధరించడం ద్వారా సోనమ్ కపూర్ అక్కడి వారి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనమ్ కపూర్ వింటేజ్ వింబుల్డన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా భారతీయులకు ట్రెండ్ తెలియదు అని, చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు ఔట్‌డేటెడ్ ఔట్ ఫిట్స్ ధరిస్తూ ఉంటారని ఇంటర్నేషల్ మీడియాలో అప్పుడప్పుడు కథనాలు వస్తూ ఉంటాయి. అలాంటి కథనాలకు సమాధానం అన్నట్లుగా సోనమ్ కపూర్ వింటేజ్ లుక్‌తో సమాధానం ఇచ్చింది. ఔట్‌డేటెట్ ఔట్ ఫిట్ అయినా అద్భుతంగా రీ క్రియేట్ చేసి, వాటిని ధరిస్తే హాలీవుడ్ ముద్దుగుమ్మల కంటే మేమే అందంగా ఉంటామని సోనమ్ కపూర్ తన లుక్‌తో చెప్పకనే చెప్పింది. సోనమ్ కపూర్ బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయకున్నా ఇలా సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
2007లో సావరియా సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సోనమ్ కపూర్ తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అనతి కాలంలోనే సోనమ్ కపూర్ సొంత ఇమేజ్‌ని ఏర్పర్చుకోవడంలో సక్సెస్ అయింది. అందుకే ఆమె బాలీవుడ్ పెద్ద హీరోలకు జోడీగా నటించింది. అంతే కాకుండా ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చి పెట్టాయి. బాలీవుడ్‌లో వరుస సినిమాలు వస్తున్న సమయంలోనే సోనమ్ కపూర్ పెళ్లి చేసుకుంది. ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సోనమ్ అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.
