స్టార్ హీరోయిన్ ఒకేసారి ఇద్దరబ్బాయిలతో డేటింగ్
కపూర్ ఫ్యామిలీ ఫ్యాషనిస్టా సోనమ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. కొన్నేళ్లుగా తన భర్త, కొడుకుతో లండన్‌లో నివసిస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 6:00 AM ISTకపూర్ ఫ్యామిలీ ఫ్యాషనిస్టా సోనమ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. కొన్నేళ్లుగా తన భర్త, కొడుకుతో లండన్‌లో నివసిస్తోంది. అప్పుడప్పుడు ముంబైలోని రెడ్ కార్పెట్ ఈవెంట్లలో సందడి చేస్తూ ఇక్కడ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి దూరంగా ఉండటంతో సోనమ్ ని అందరూ ఇప్పటికే మర్చిపోయారు.
అయితే ఇలాంటి సమయంలో ఈ భామ ఒక బిగ్ బాంబ్ పేల్చింది. తన యవ్వనంలో ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేసానని పేర్కొంది. ఒకరికి తెలియకుండా ఒకరిని చీట్ చేసానని సూటిగా అంగీకరించింది. అయితే ఇదంతా పెళ్లికి ముందు జీవితం మాత్రమే. పెళ్లి తర్వాత మాత్రం భర్తకే కమిటై ఉందట.
గతంలో దీపిక పదుకొనే కూడా ఇదేవిధంగా మాట్లాడింది. రణ్‌వీర్‌తో డేటింగ్ లో ఉన్నప్పుడు ఇతర అబ్బాయిలను కూడా చూసేదానిని అని దీపిక పదుకొనే బహిరంగంగా అంగీకరించింది. కానీ రణ్ వీర్ కి కట్టుబడి ఉన్నానని కాస్త వ్యంగ్యంగా చెప్పింది. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్‌ల వ్యవహారం క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోయింది. ముంబై మెట్రో నగరంలో మగువల పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. అల్ట్రా మోడ్రన్ కల్చర్ లో ఇలాంటి అమానవీయ సంబంధాలకు కొదవేమీ లేదు. మోడ్రన్ లైఫ్ చాలా పాఠాలు నేర్పిస్తున్నా ఇంకా బుద్ధి రావడం లేదు! అంటూ నెటిజనులు చీవాట్లు పెడుతున్నారు. అయితే సోనమ్ ఇప్పుడే ఇలా ఎందుకు చెబుతోంది? ఉన్నట్టుండి తనపైకి అటెన్షన్ ని డ్రాగ్ చేసేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తోందా? ఇంతకీ ఈ బ్యూటీ తిరిగి బాలీవుడ్ లో అడుగుపెడుతోందా? అందుకే ప్రచారం కోరుకుంటోందా? అన్నదానికి కాలమే సమాధానమివ్వాల్సి ఉంది.
