Begin typing your search above and press return to search.

టాప్ లెస్ ఫోజులో గుబులు రేపిన సోన‌మ్

ఆ నుదుటిన భారీత‌నం నిండిన పాపిడి బొట్టులాంటి ఆ హారం.. ఇన్న‌ర్ ఏదీ ధ‌రించ‌కుండా డ్యాషింగ్ టాప్ లెస్ ఫోజుతో సోన‌మ్ తాజా ఫోటోషూట్ లో క‌ట్టి ప‌డేసింది.

By:  Tupaki Desk   |   2 May 2025 8:56 PM IST
టాప్ లెస్ ఫోజులో గుబులు రేపిన సోన‌మ్
X

ఈ భూప్ర‌పంచంలో ఎన్నో సంస్కృతులు, ప్రాంతాన్ని బ‌ట్టి, దేశాన్ని బ‌ట్టి.. భాష వేషం సంస్కృతి ప్ర‌తిదీ మారిపోతాయి. అలాగే ఈజిప్షియ‌న్ క‌ల్చ‌ర్ లో అత్యంత పురాత‌న‌మైన సంస్కృతి.. అక్క‌డి స‌మాధులు నిర్మాణాలు, వాటి వెన‌క క‌థ‌లు ప్ర‌జ‌ల హృద‌యాల్లో పాతుకుపోయాయి. మ‌మ్మీ, మ‌మ్మీ 2 సినిమాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం వెన‌క ఈజిప్ట్ క‌ల్చ‌ర్ లో దాగి ఉన్న పురాణేతిహాస క‌థ‌లు, పాత్ర‌ల యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఒక కార‌ణం అన‌డంలో సందేహం లేదు.

చూస్తుంటే, ఇక్క‌డ భార‌తీయ ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్ ఈజిప్ట్ టోంబ్ నుంచి నిదుర లేచిన మ‌మ్మీ లా క‌నిపిస్తోంది. ఆ నుదుటిన భారీత‌నం నిండిన పాపిడి బొట్టులాంటి ఆ హారం.. ఇన్న‌ర్ ఏదీ ధ‌రించ‌కుండా డ్యాషింగ్ టాప్ లెస్ ఫోజుతో సోన‌మ్ తాజా ఫోటోషూట్ లో క‌ట్టి ప‌డేసింది. 39ఏళ్ల బ్యూటీ గ్లామ‌ర్ క్వీన్ ని త‌ల‌పించింది. ఈ లుక్ చూడ‌గానే గోల్డెన్ గాళ్ సోన‌మ్ అదిరిపోయింది అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.

సోనమ్ కపూర్ అందాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫ్యాష‌నిస్టా 14వ సారి వోగ్ ఇండియా కవర్ గర్ల్‌గా మెరుపులు మెరిపించింది. మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోని సోన‌మ్ లుక్ ని డిజైన్ చేయ‌గా, అది త‌న స్థాయిని అమాంతం ప‌దింత‌లు పెంచింది. ఈ రూపం కోసం ఎంపిక చేసుకున్న మేక‌ప్, వ‌స్త్రాభ‌ర‌ణాలు ప్ర‌తిదీ వేటిక‌వే ప్ర‌త్యేకం. సోనమ్ కపూర్ గోల్డెన్ గర్ల్ స్టైల్, గ్లామ్ అవ‌తార్ యువ‌త‌రం హృద‌యాల‌ను సున్నితంగా ట‌చ్ చేసింది. వీరే ది వెడ్డింగ్, ఏకే వ‌ర్సెస్ ఏకే, బ్లైండ్ వంటి చిత్రాల‌లో న‌టించాక, సోన‌మ్ న‌ట‌న‌కు దూరంగా ఉంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి విదేశాల్లో వ్యాపారాల‌ను చ‌క్క‌దిద్దుకుంటోంది.