Begin typing your search above and press return to search.

అది సరిగ్గా చేసి ఉండకుంటే ఇండస్ట్రీ వదిలేదాన్ని..!

ఈ అమ్మడు అయిదు పదుల వయసులోనూ నటనను వదల్లేదు.

By:  Tupaki Desk   |   25 April 2024 10:00 PM IST
అది సరిగ్గా చేసి ఉండకుంటే ఇండస్ట్రీ వదిలేదాన్ని..!
X

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు దక్కించుకున్న సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే. ఈ అమ్మడు అయిదు పదుల వయసులోనూ నటనను వదల్లేదు. తాజాగా ఈమె 'ది బ్రోకెన్ న్యూస్‌' అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

మే 3న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ది బ్రోకెన్ న్యూస్ వెబ్‌ సిరీస్ ప్రమోషన్‌ లో సోనాలి బింద్రే పాల్గొన్నారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. కెరీర్ ఆరంభంలో తాను డాన్స్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి నేను డాన్స్ లో శిక్షణ తీసుకోలేదు. అప్పట్లో డాన్స్ రాకుంటే హీరోయిన్ గా పనికి రారు అన్నట్లుగా భావించే వారు. అలాంటి సమయంలో నేను అరవింద స్వామి, మనీషా కోయిరాలా జంటగా నటించిన బొంబాయి సినిమాలో ఒక పాటలో నటించే అవకాశం దక్కించుకున్నాను.

మణిరత్నం గారు అప్పటికే అయిదు సినిమాలు చేసిన నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఆ పాటకు డాన్స్‌ బాగా చేయకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వేయాలి అనుకున్నాను. ప్రభుదేవ గారు ఆ పాటకు కొరియోగ్రఫర్ అవ్వడంతో మరింత ఛాలెంజింగ్‌ గా తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ డాన్స్ చేశాను.

పాటలోని ఎక్కువ షాట్స్ సింగిల్‌ టేక్ కి ఓకే అవ్వడం విశేషం. పాట చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత కొరియోగ్రఫర్‌ సుందరం మాస్టర్‌ నాకు రూ.100 ఇచ్చి అభినందించారు. ఆ మూమెంట్‌ ని నేను ఎప్పుడూ మరచిపోలేను అంటూ సోనాలి బింద్రే గత అనుభవాలను నెమరవేసుకుంది.