Begin typing your search above and press return to search.

ప్రచారం కోసం ఆ చెత్త రూమర్స్ : సోనాలి బింద్రే

ది బ్రోకెన్ న్యూస్‌ సీజన్ 2 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సోనాలి బింద్రే తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   3 May 2024 11:30 PM GMT
ప్రచారం కోసం ఆ చెత్త రూమర్స్ : సోనాలి బింద్రే
X

హీరో, హీరోయిన్‌ ఇతర సెలబ్రిటీల గురించి సోషల్‌ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు ఆ హీరోయిన్‌, ఈ హీరో రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగితే తదుపరి రోజే ఆ హీరోయిన్‌ మరో దర్శకుడితో వ్యవహారం సాగిస్తుంది అనే పుకార్లు షికార్లు చేస్తున్న రోజులు ఇవి.

ఇలాంటి పుకార్లే గతంలో కూడా ఉండేవి. సోషల్‌ మీడియా పరిధి విపరీతంగా విస్తరించిన నేపథ్యంలో ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా ఆ పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. గతంలో పుకార్లను స్వయంగా నిర్మాతలు పుట్టించే వారు అంటూ సీనియర్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే షాకింగ్‌ కామెంట్స్ చేసింది.

ది బ్రోకెన్ న్యూస్‌ సీజన్ 2 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సోనాలి బింద్రే తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. 90 ల్లో ఉన్న సినీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని చెప్పుకొచ్చింది.

90 ల్లో హీరో హీరోయిన్స్ మధ్య రిలేషన్ ను నిర్మాతలు స్వయంగా క్రియేట్‌ చేసేవారు. నా గురించి కూడా చాలా పుకార్లు వచ్చాయి. అయితే వాటిని నిర్మాతలే సృష్టించారు అని తెలిసి షాక్ అయ్యాను. సినిమాల ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పుకార్లను వారు క్రియేట్‌ చేస్తున్నట్లుగా తెలిసి నేను ఆశ్చర్యపోయాను అంది.

నేను ఇండస్ట్రీలోకి రావాలని మొదటి నుంచి అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను. ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో నాకు డాన్స్ మరియు నటన పై అవగాహణ లేదు. అయినా కూడా సినిమాల్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అన్నింటిలో ప్రావిణ్యం సాధించాను అంది.

ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టిన కాలంలో హీరోయిన్స్ కాస్త బొద్దుగా ఉండేవారు. అందరిలోకి నేను చాలా సన్నగా ఉండేదాన్ని. దాంతో నన్ను అంతా కూడా సన్నగా ఉన్నావు అంటూ ఎగతాళి చేసేవారు అంటూ సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది. వెబ్‌ సిరీస్‌ తో రీ ఎంట్రీ ఇచ్చిన సోనాలి ముందు ముందు సినిమాల్లో కూడా వరుసగా నటించేందుకు సిద్ధం అంది.