Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : భక్తి పారవశ్యంలో బాలయ్య బ్యూటీ

తాజాగా మరోసారి సోనాల్‌ చౌహాన్ అదే తరహా ఫోటోలు షేర్ చేసింది. కామఖ్య మందిర్‌ లో దేవుడి దర్శణం చేసుకున్న సోనాల్‌ చౌహాన్‌ అక్కడి ఫోటోలు షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 7:36 AM GMT
పిక్ టాక్ : భక్తి పారవశ్యంలో బాలయ్య బ్యూటీ
X

బాలయ్య తో లెజెండ్‌, డిక్టేటర్‌, రూలర్‌ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్‌. ఈ అమ్మడు తెలుగు లో కంటే ఉత్తరాదిన ఎక్కువ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం బెంగాళి సినిమాతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే.

ఆ మధ్య భక్తురాలిగా మారి దేవుని పూజలో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి అందరిని సర్‌ ప్రైజ్ చేసింది. ఒక వైపు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ మరో వైపు ఇలాంటి భక్తి ఫోటోలు ఏంటి అమ్మడు అంటూ చాలా మంది ఆ సమయంలో కామెంట్స్ చేశారు.

తాజాగా మరోసారి సోనాల్‌ చౌహాన్ అదే తరహా ఫోటోలు షేర్ చేసింది. కామఖ్య మందిర్‌ లో దేవుడి దర్శణం చేసుకున్న సోనాల్‌ చౌహాన్‌ అక్కడి ఫోటోలు షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో ఎప్పుడు కన్నుల పండుగ చేసే సోనాల్‌ ఈసారి కూడా భలే అందంగా ఉందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

భక్తి పారవశ్యంలో మునిగిన సోనాల్‌ చౌహాన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. మళ్లీ సౌత్ లో ఈ అమ్మడు అందాల ఆరబోత పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా చూడాలి.