Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే పార్టీలో సోనాల్ చిలౌట్

ఈ బ్యూటీ టాలీవుడ్ లో బాల‌య్య స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:18 AM GMT
బ‌ర్త్ డే పార్టీలో సోనాల్ చిలౌట్
X

అప్ప‌టిక‌ప్పుడు చీర‌లో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపిస్తుంది. కార్తీక మాసం శివుడిని పూజిస్తుంది. ఇంత‌లోనే చిట్టి పొట్టి డ్రెస్సుల్లోకి ఒదిగిపోతుంది. ప‌బ్బులు క్ల‌బ్బులు పార్టీలు అంటూ సంద‌డి చేస్తుంది. వీలున్న ప్ర‌తిసారీ విదేశీ బీచ్ వెకేష‌న్ల‌లో బికినీల్లో దుమ్ము దులిపేస్తుంది. ఇలాంటి విల‌క్ష‌ణ‌తతో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచేస్తోంది సోనాల్ చౌహాన్. ఈ బ్యూటీ టాలీవుడ్ లో బాల‌య్య స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇటీవ‌ల అవ‌కాశాలు అందుకోవ‌డంలో త‌డ‌బ‌డుతోంది.


అటు బాలీవుడ్ లోను కెరీర్ ఆశించినంత‌గా వెల‌గ‌లేదు. అందుకే ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది. ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేస్తూ అభిమానుల‌కు ఇన్ స్టాలో ట‌చ్ లో ఉంటోంది. ఇప్పుడు సోనాల్ నైట్ పార్టీ ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో పిక్క‌ల పైకి పొట్టి దుస్తుల‌ను ధ‌రించి ఫుల్ గా చిలౌట్ చేస్తూ క‌నిపించింది.


లాస్ట్ నైట్ డంప్ అంటూ బ‌ర్త్ డే పార్టీలో త‌న స్నేహితుల‌తో క‌లిసి దిగిన ఫోటోల డంప్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది సోనాల్. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. బోయ్ ఫ్రెండ్స్ తో సోనాల్ ఎంతో స‌న్నిహితంగా మెలుగుతున్న ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. పార్టీ క్రౌడ్ లో సోనాల్ ఫాలోయింగ్ ని ఈ ఫోటోలు ఆవిష్క‌రిస్తున్నాయ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఇదే పార్టీలో నుపుర్ సనన్, సునీల్ గ్రోవర్, ఇలియా వంతూర్, షెహనాజ్ గిల్, సోనాల్ చౌహాన్, తేజస్వి ప్రకాష్, అవనీత్ కౌర్ సహా బాలీవుడ్ ప్రముఖులు ముంబైలో రాఘవ శర్మ పుట్టినరోజు వేడుకలో చిల్ చేసారు. పార్టీ నైట్ వీరంతా మత్తుగా క‌నిపించిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి.


ఇంత‌కుముందే సోనాల్ చౌహాన్ వారణాసిలోని గంగా ఘాట్ వద్ద శివునికి ప్రార్థనలు చేసిన‌ప్పుడు సాదాసీదా చీర‌లో క‌నిపించింది. ఈ ఫోటోలకు `వరల్డ్ కీ సబ్సే అచ్చి ఫోటో` అని ఫ్యాన్స్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంత‌లోనే ఇప్పుడు ఇలా పార్టీలో సంథింగ్ స్పెష‌ల్ గా కొత్త లుక్ తో క‌వ్వించింది.