Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బాలయ్య హీరోయిన్‌ శివరాత్రి స్పెషల్‌

బాలకృష్ణ తో కలిసి లెజెండ్‌, డిక్టేటర్‌, రూలర్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్

By:  Tupaki Desk   |   8 March 2024 8:17 AM GMT
పిక్ టాక్‌ : బాలయ్య హీరోయిన్‌ శివరాత్రి స్పెషల్‌
X

బాలకృష్ణ తో కలిసి లెజెండ్‌, డిక్టేటర్‌, రూలర్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తోంది.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈసారి సోషల్‌ మీడియాలో శివ రాత్రి స్పెషల్‌ అన్నట్లుగా శివ లింగంకు పూజ చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అంతే కాకుండా శివ భక్తులతో కలిసి ఫోటోలు తీసుకున్న సోనాల్‌ చౌహాన్ వాటిని కూడా షేర్‌ చేసింది.

అందాల ఆరబోత ఫోటోలతో పలు సార్లు వైరల్‌ అయిన సోనాల్‌ ఈసారి ఈ శివ భక్తి ఫోటోలతో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. సాధారనంగా ఇలాంటి ఫోటోలను నెటిజన్స్‌ లైట్‌ తీసుకుంటారు. కానీ బాలయ్య హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్ మాత్రం ఈ ఫోటోలతో కూడా కట్టి పడేస్తోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలకు పెద్దగా కమిట్‌ అవ్వడం లేదు. కానీ ఇంతటి అందంకు వెబ్‌ సిరీస్ ల్లో కూడా మంచి ఆఫర్లు దక్కుతాయి. అయితే ఈ అమ్మడు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపించడం లేదు. ముందు ముందు ఈమె మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.